Don't Miss!
- Finance
ghmc tax fraud: అలా పన్ను చెల్లించిన వారిపై GHMC ఆగ్రహం.. FIR నమోదుకు రంగం సిద్ధం
- News
అనుచరులతో ఆనం మరో భేటీ- రెండునెలల్లో రెడీగా ఉండాలని సూచన-కోర్టు కెళ్దామంటూ..
- Sports
INDvsNZ : ఫ్యూచర్ ఇదే.. గిల్‌ను స్టార్ అంటూ మెచ్చుకున్న విరాట్ కోహ్లీ!
- Lifestyle
Yoga For Eyes: కంటి యోగా.. చూపు మెరుగవుతుంది, ఇంకా ఎన్నో లాభాలు
- Technology
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Lovestory ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ అందుబాటులో ఉంటుంది అంటే?
కరోనా
సెకెండ్
వేవ్
తర్వాత
భారీ
ప్రీ
రిలీజ్
బిజినెస్‌తో
ప్రేక్షకుల
ముందుకు
వచ్చిన
సినిమా
'లవ్
స్టోరీ'.
నాగ
చైతన్య..
సాయి
పల్లవి
కాంబోలో
వచ్చిన
ఈ
సినిమాకు
మంచి
రెస్పాన్స్
రాగా
అందుకు
తగ్గట్టుగానే
కలెక్షన్లు
కూడా
వస్తున్నాయి.
అయితే
ఈ
సినిమా
డిజిటల్
స్ట్రీమింగ్
డేట్
ఫిక్స్
అయింది.
ఆ
వివరాల్లోకి
వెళితే

శేఖర్ కమ్ముల మ్యాజిక్
అక్కినేని నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన 'లవ్ స్టోరీ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాసు నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సిహెచ్ దీనికి సంగీతం సమకూర్చిన ఈ సినిమా ఒక సున్నితమైన ప్రేమకథతో రూపొందింది.

భారీ అంచనాలతో
ఇక 'లవ్ స్టోరీ' సినిమాకు ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీనికి దీని నుంచి విడుదలైన ప్రతి పాట, పోస్టర్, టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో సినిమాకు బిజినెస్ కూడా భారీగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది రూ. 31.20 కోట్లకు అమ్ముడుపోయింది.

మొదటి రెండు వారాలలో ఇలా
'లవ్ స్టోరీ' బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ సక్సెస్ ఫుల్‌గా ముగించింది. కానీ వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి అనుకోని ఇబ్బందులతో కలెక్షన్స్ తగ్గాయి. ఈ సినిమాకు పలు కారణాలకు తోడు గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ కూడా పడడంతో కలెక్షన్స్‌కి గట్టి దెబ్బే తగిలింది. ఇక లవ్ స్టోరీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో సినిమా 28.16 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా రెండో వారంలో 4.32 కోట్ల షేర్ అందుకుంది.

లాభాలతో
అలా రెండు వారాల్లో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకున్న లవ్ స్టోరీ లాభాలతో మూడో వారంలోకి ఎంటర్ అయ్యింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 16 వ రోజు 15 లక్షల షేర్‌ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్‌గా 17 లక్షల దాకా షేర్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 31.20 కోట్లకు అమ్మగా సినిమా 32 కోట్ల టార్గెట్ తో బరిలోకి రెండు వారాల తర్వాత 77 లక్షల ప్రాఫిట్‌ను సొంతం చేసుకుని దూసుకుపోతుంది.

'ఆహా'లో రిలీజ్
ఆ సంగతి అలా ఉంచితే ఈ సినిమా డిజిటల్ వేదికగా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని కొంత మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇక ఎట్టకేలకు ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకుల కోసం కూడా విడుదల కావడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.. ఈ సినిమా అక్టోబర్ 22వ తేదీన డిజిటల్ ప్రేక్షకుల కోసం ఆహా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.

వస్తుందా? రాదా?
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఈ సినిమా డిజిటల్ హక్కులు మాత్రం ఆహా సంస్థ దక్కించుకుంది. సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ మొదలు కావాల్సి ఉందని నిబంధనల ఉన్న నేపథ్యంలో 22వ తారీఖున సినిమా రావొచ్చు రాకపోవచ్చు విశ్లేషణలు వినబడుతున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.