»   » సినిమా హిట్టైనా పూర్ డైరెక్టర్...లక్కీ ప్రొడ్యూసర్....!?

సినిమా హిట్టైనా పూర్ డైరెక్టర్...లక్కీ ప్రొడ్యూసర్....!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మిస్టర్ ఫర్ ఫెక్ట్ చిత్రం ఈ ఏడాదిలో ఇంతవరకు విడుదలైన తెలుగు సినిమాల్లో పెద్ద హిట్ గా నిలిచే దిశగా దూసుకెళుతోంది. భారీ విజయాన్ని సాధించిన ఈ చిత్రంతో మళ్ళీ డైరెక్టర్ దశరథ్ కి పునర్జన్మ లభించింది. 'సంతోషం"తో దర్శకుడిగా పరిచయమైన దశరథ్ ఆ తర్వాత వరుస పరాజయాలతో తన గొయ్యి తనే తవ్వుకున్నాడు. అయితే అనుకోకుండా దిల్ రాజు సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం అతడికి లభించింది. ఇతనితో పని చేయడానికి ప్రభాస్ సంశయించినా కానీ దిల్ రాజు అతడిని ఒప్పించి దశరథ్ తోనే ఈ సినిమా తీశాడు.

ఇప్పుడు మిస్టర్ ఫెర్ ఫెక్ట్ పెద్ద హిట్టయింది కానీ దశరథ్ కి జనాల నుంచి గుర్తింపు రావట్లేదు. కేవలం దిల్ రాజు సినిమాగా చలామణీ అయిపోతున్న ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది కూడా ఎవరూ పట్టించుకోవడంల లేదు. అందుకే ఈ చిత్రానికి తనే దర్శకుడినని అంతా గుర్తించాలని దశరథ్ రెండ్రోజుల క్రితం పలువురు దర్శకులు, తన స్నేహితులకి పెద్ద పార్టీ ఇచ్చాడు. సామాన్య జనం గుర్తించినా లేకపోయినా సినీ జనం అయినా తనని గుర్తిస్తే ఇంకొన్ని అవకాశాలొస్తాయని దశరథ్ ఆశ పడుతున్నాడు.

English summary
Young rebel star Prabhas is on a high.His previous film 'Darling' was a money spinner and so is his current flick 'Mr Perfect'. This movie has been declared a hit. The usual reclusive Prabhas went on a victory rally to celebrate the movie's success.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu