»   » ఉద్యోగుల పొట్టగొట్టిన మెగాస్టార్, జూనియర్ ఎన్టీఆర్? .. రోడ్డున పడ్డ 80 మంది..

ఉద్యోగుల పొట్టగొట్టిన మెగాస్టార్, జూనియర్ ఎన్టీఆర్? .. రోడ్డున పడ్డ 80 మంది..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం టెలివిజన్ రంగం మంచి బూమ్‌లో ఉంది. వెండి తెర స్టార్ హీరోలంతా ఇప్పుడు బుల్లితెర మీద పడ్డుతున్నారు. కేబీసి తెలుగు వెర్షన్‌లో ముందు నాగార్జున, తర్వాత చిరంజీవి సందడి చేశారు. ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగు, తమిళ వెర్షన్లలో కమల్, ఎన్టీఆర్‌లు హోస్ట్‌లుగా మారారన్న సంగతి తెలిసిందే. ప్రేక్షకుల వరకు ఇదంతా బాగానే ఉంది. కానీ అసలు ముప్పు వస్తున్నది ఆయా ఛానెల్లలో పనిచేసే ఉద్యోగులకే అనే మాట వినిపిస్తున్నది. బిగ్‌బాస్‌లోకి ఎన్టీఆర్ రంగ ప్రవేశం తర్వాత చాలా మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారనే విషయం మీడియాలో సంచలనంగా మారింది.

స్టార్ మా ఉద్యోగుల ఏరివేత కార్యక్రమం

స్టార్ మా ఉద్యోగుల ఏరివేత కార్యక్రమం

ప్రస్తుతం ఐటీ కంపెనీలలో ఉద్యోగుల తొలగింపు ఊపందుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా చూసుకొంటే ఐటీ రంగం తర్వాత ఎక్కువగా ఉద్యోగుల తొలగింపు ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోనే అనే విషయం ఇటీవల తాజా సర్వేలో వెల్లడైంది. అందుకు తగినట్టుగానే స్టార్ మా టెలివిజన్ చేపట్టిన ఉద్యోగుల ఏరివేత కార్యక్రమం దానికి బలం చేకూరుస్తున్నది.

సీనియర్ ఉద్యోగులపై యాజమాన్యం వేటు

సీనియర్ ఉద్యోగులపై యాజమాన్యం వేటు

ప్రేక్షకుల విశేష ఆదరణ చూరగొన్న మా టీవిని స్టార్ టెలివిజన్ ఛానెల్ కొనుగోలు చేసింది. అనంతరం దానికి స్టార్ మా అనే పేరుపెట్టింది. ఆ తర్వాత చేపట్టిన ప్రక్రియలో భాగంగా దాదాపు 80 మంది సీనియర్ మోస్ట్ ఉద్యోగులను ఉన్నపళంగా పీకేసింది. వారికి రావాల్సిన మొత్తాలను వెంటనే సర్దుబాటు చేసింది. అయితే భారీ మొత్తంలో వారికి డబ్బు చెల్లించడం ఉద్యోగులకు కొంత ఊరట కలిగిందనే మాట వినిపిస్తున్నది. అంతేకాకుండా మరికొంత మంది సీనియర్లను ఉద్యోగాలు వెతుకోవాలని ఉన్నతాధికారులు డిమాండ్ చేసినట్టు సమాచారం.

షాక్ గురైన ఉద్యోగులు

షాక్ గురైన ఉద్యోగులు

స్టార్ మా యాజమాన్యం తీసుకొన్న దారుణమైన నిర్ణయంతో దాదాపు ఏడేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులు దిగ్భ్రాంతికి గురైనట్టు సమాచారం. దీనికి కారణం ఇటీవల కాలంలో ప్రసారమైన ఏ కార్యక్రమం కూడా అంతగా ప్రజాదరణను చూరగొనకపోవడమే కారణమని వినిపిస్తున్నది.

చిరంజీవి ఎంఈకే‌కు స్పందన కరువు

చిరంజీవి ఎంఈకే‌కు స్పందన కరువు

ఇటీవల కాలంలో మా టీవీ ప్రసారం చేసిన కార్యక్రమాలలో మీలో ఎవరు కోటీశ్వరుడు కూడా ప్రజాదరణను పొందలేకపోయిందని మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ హోస్ట్‌గా ఉంటే భారీగా టీఆర్పీ పెరుగుతుందని యాజమాన్యం ఊహించిందట. అయితే ఆ కార్యక్రమానికి టీఆర్పీ రాకపోవడంతో వారి అంచనాలు తలకిందులైనట్టు తెలుస్తున్నది.

ఎన్టీఆర్ బిగ్‌బాస్ కోసం సర్దుబాటు

ఎన్టీఆర్ బిగ్‌బాస్ కోసం సర్దుబాటు

ఇక జూనియర్ ఎన్టీఆర్ చేయబోతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతే కష్టమేనని భావించిన యాజమాన్యం ముందే సర్దుకున్నట్టు తెలుస్తున్నది. దాదాపు 80 మందిని తొలగించి ఆర్థిక వ్యవహారాలను చక్కబరిచే ఉద్దేశంతో ముందుకెళ్తున్నది. తొలగించిన ఉద్యోగుల స్థానంలో అవసరమైన మేరకు కొత్త ఉద్యోగులను తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టు మరో వార్త వినిపిస్తున్నది.

English summary
Recently, MAA TV, which was turned as Star Maa after Star group acquired it. Sources informed that they have sacked 80 of its senior-most employees. They have demanded many senior people who are working in various departments to quit their jobs. A reason behind layoffs hints that, whatever the programs were being telecasted in the channel are not getting good TRP ratings. Even, Mega Star Chiranjeevi's recent reality show Meelo Evaru Koteeswarudu failed to meet the expectations. Apparently, they don't want the same TRP rating when they telecast most popular Big Boss Jr.NTR's show.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu