»   » ‘బ్రహ్మోత్సవం’ ఇన్ సైడ్ టాక్ నిజమేనా? లేక

‘బ్రహ్మోత్సవం’ ఇన్ సైడ్ టాక్ నిజమేనా? లేక

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత శ్రీకాంత్ అడ్డాల, మహేశ్ కాంబినేషన్‌లో రూపొందిన 'బ్రహ్మోత్సవం' ఈనెల 20న విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న చిత్రం సోమవారం సెన్సార్ పూర్తిచేసుకుని క్లీన్ 'యు' సర్టిఫికేట్ పొందింది.

సింగిల్ కట్ కూడా లేకుండా సెన్సార్ పూర్తిచేసుకుని శుక్రవారం విడుదలకు రెడీ అయింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం సెన్సార్ టాక్ అంటూ కొందరు ఇన్ సైడ్ టాక్ అంటూ కొందరు సినిమాపై ఓ టాక్ ని వెబ్ మీడియాలో ప్రచారంలోకి తీసుకువచ్చారు.


Mahesh Babu Bramotsavam Movie Inside Talk Story

ఈ సినిమా ఫస్టాఫ్ చాలా స్మూత్ గా , ఫన్నీ సీక్వెన్స్ లతో సాగిపోతుందని, అయితే సెకండాఫ్ కు వచ్చేసరికి లాగ్ ఉంటుందని, కొంత ఎమోనల్ మెలోడ్రామా ఉండటమే దానికి కారణమని , కొంచెం ఇక్కడ ప్రేక్షకుడు ఇబ్బంది పడతారని అంటున్నారు. అయితే క్లైమాక్స్ కు వచ్చేసరికి అంతా సర్దుకుంటుందని, ముఖ్యంగా ప్రి క్లైమాక్స్ లో మహేష్ తన నటనతో సినిమాని ఎక్కడికో తీసుకు వెళ్లిపోయాడని ఈ టాక్ సారాంశం.


అయితే ఇది రాయటానికి సినిమానే చూడక్కర్లేదు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు దర్శకుడు కాబట్టి ఆ సినిమాలాగానే ఇదీ ఉంటుందని ఊహించి రాసేసారని ఓ వర్గం అంటోంది. అయితే ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, టీజర్స్, మేకింగ్ వీడియోలు సినిమాపై ఓ రేంజిలో హైప్ క్రియేట్ చేసాయి..మరి వాటిని ఏ స్దాయిలో నిలబెట్టుకుంటుందో చూడాలి.


Mahesh Babu Bramotsavam Movie Inside Talk Story

మహేష్ బాబు మాట్లాడుతూ... దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాలతో లోగడ "సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు' సినిమా చేశాను. అయితే ఆ సినిమాకు "బ్రహ్మోత్సవం'కు ఎలాంటి పోలికలు లేవు. ఇదో కొత్తరకమైన కథ. ఆహ్లాదభరితంగా చాలా బావుంటుంది. ఇప్పటివరకు నేను ఇలాంటి సినిమాను చేయలేదు.


కుటుంబం మధ్య జరిగే ఈ కథలో చక్కటి ప్రేమకథ కూడా మిళితమై ఉంటుంది. కుటుంబ భావోద్వేగాలు, సెంటిమెంట్స్‌ వంటి అంశాలతో సాగే కథ ఇది. ముఖ్యంగా ఇందులోని భావోద్వేగాలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఈ చిత్రంపై నేనెంతో నమ్మకంగా ఉన్నాను అన్నారు.


Mahesh Babu Bramotsavam Movie Inside Talk Story

అలాగే బ్రహ్మోత్సవం' సినిమా చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఒకే తరహా కథలు కాకుండా విభిన్నమైన కథాచిత్రాలు చేయాలి. ఆ కోవలోనే ఈ చిత్రం చేశారు. దర్శకుడు శ్రీకాంత్‌ "శ్రీమంతుడు' సినిమా సమయంలోనే నాకు ఈ చిత్రకథను చెప్పారు. కథ ఎంతోబాగా ఆకట్టుకోవడంతో పాటు శ్రీకాంత్‌పై ఉన్న నమ్మకంతో వేరే ఆలోచన లేకుండా అప్పుడే ఈ సినిమా చేయడానికి అంగీకరించాను అని చెప్పుకొచ్చారు.


Mahesh Babu Bramotsavam Movie Inside Talk Story

సూపర్‌స్టార్‌ మహేష్‌ సరసన సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, జయసుధ, రేవతి, నరేష్‌, రావు రమేష్‌, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్‌, తులసి, ఈశ్వరీరావు, షాయాజీ షిండే, కృష్ణభగవాన్‌, రజిత, కాదంబరి కిరణ్‌, చాందిని చౌదరి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


ఈ చిత్రానికి డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె. మేయర్‌, డాన్స్‌: రాజుసుందరం, ప్రొడక్షన్‌ డిజైనర్‌: తోట తరణి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సందీప్‌ గుణ్ణం, నిర్మాతలు: పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల.

English summary
Bramotsavam is coming with a clean ‘U’ certificate and here are few details.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X