»   » కొరటాల శివ కు సర్పైజ్ గిఫ్ట్ ఇచ్చిన మహేష్

కొరటాల శివ కు సర్పైజ్ గిఫ్ట్ ఇచ్చిన మహేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ తో 'శ్రీమంతుడు' వంటి హిట్ ఇచ్చిన చిత్ర దర్శకుడు కొరటాల శివ. ఆయన్ను నిన్న మహేష్ ఓ సర్ఫైజ్ గిప్ట్ ఇచ్చిన ఆశ్చర్యపరిచినట్లు సమాచారం. ఆ గిఫ్ట్ మరేదో కాదు..ఆడి కారు. ఆయన కొరటాల శివ ను నిన్న సాయింత్రం జూబ్లిహిల్స్ లోని ఆడి కార్ల షో రూమ్ కు రమ్మని పిలిచారు. అక్కడకు క్యాజువల్ గా వచ్చన కొరటాలకు ఆయన కొద్ద ఎ6 ఆడి కారు ని గిప్ఠ్ గా ఇచ్చినట్లు సమాచారం. దాంతో కొరటాల శివ ఆనందంలో మునిగిపోయినట్లు చెప్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కొరటాల శివ కెరీర్ విషయానకి వస్తే...

మిర్చి లాంటి సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత దర్శకుడు కొరటాల శివ కు చాలా గ్యాప్ వచ్చింది. ఎందుకంటే వరసగా ఆయన కథలు చెప్తూనే ఉన్నారు. అయితే ఎక్కడా ఓకే కాలేదు. రామ్ చరణ్ ,ఎన్టీఆర్, చిరంజీవి కోసం ఆయన కథలు వినిపించారు. అయితే ఏమీ వర్కవుట్ కాలేదు. ఈ లోగా ఆయన మహేష్ ని కలిసి కథ ఒప్పించుకుని శ్రీమంతుడుని తెరకెక్కించారు. అలాగే అందరి అంచనాలను తగ్గకుండా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నారు.

Mahesh Babu Gifted Audi Car to Director Koratala Shiva

ఈ నేపధ్యంలో కొరటాల శివకు స్టార్ హీరోలంతా బొకేలు పంపి శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లోగా ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్టుని కొరటాల శివ తో ఓకే చేసుకున్నారు ఎన్టీఆర్. శ్రీమంతుడు నిర్మించిన బ్యానర్ పైనే ఈ సినిమా రూపొందనుంది. ఆ తర్వాత రామ్ చరణ్ అంటున్నారు. ఇలా కాదన్న హీరోలు మళ్లీ వరస పెట్టడం విజయమే మరి.

''కథని నమ్మి చేసిన సినిమా 'శ్రీమంతుడు'. చిత్రబృందమంతా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఈ సినిమాకి వస్తున్న స్పందన చూస్తుంటే ఆ కష్టమంతా ఎగిరిపోతోంద''న్నారు కొరటాల శివ. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'శ్రీమంతుడు'. మహేష్‌బాబు, శ్రుతి హాసన్‌ జంటగా నటించారు. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మించింది.

కొరటాల శివ మాట్లాడుతూ ''ఈ కథ ఒప్పుకొని, మమ్మల్ని ముందుండి నడిపించారు మహేష్‌. మాకంటే ఆయనే ఎక్కువ కథని నమ్మారు. ప్రేక్షకులకూ మా ప్రయత్నం నచ్చింది. తొలిరోజే 'సూపర్‌ హిట్‌' అనే ముద్ర వేసేశారు''అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన నవీన్‌ యర్నేని మాట్లాడుతూ ''మా సంస్థ నుంచి వచ్చిన తొలి చిత్రమిది. తొలి రోజు నుంచే శ్రీమంతుడు పేరుకు తగ్గట్టే సిరులు కురిపిస్తున్నారు''అన్నారు.

English summary
Upon the success of "Srimanthudu" at box office, Mahesh Babu has gifted a brand new Audi A6 car to Koratala Siva.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu