»   » సొనాలి బింద్రే కోరిక తీర్చనున్న మహేష్‌బాబు.. క్యాన్సర్ వ్యాధిన పడిన బ్యూటీకి..

సొనాలి బింద్రే కోరిక తీర్చనున్న మహేష్‌బాబు.. క్యాన్సర్ వ్యాధిన పడిన బ్యూటీకి..

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Mahesh Babu Family Meets Sonali Bendre

  క్యాన్సర్ వ్యాధితో బాలీవుడ్ అందాల నటి సొనాలి బింద్రేను తన సన్నిహితులు, స్నేహితులు, సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. క్యాన్సర్ మహమ్మారి నుంచి కోలుకోవాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. తాజాగా సొనాలిని కలుసుకొన్న వారిలో ప్రిస్స్ మహేష్ బాబు ఫ్యామిలీ కూడా ఉన్నారు. సోనాలిని కలిసిన విషయంపై నమ్రతా శిరోద్కర్ ఇటీవల మీడియాతో పంచుకొన్నారు. నమ్రత ఏమన్నారంటే..

  కంటిచూపు మందగించింది.. బాధను పంచుకొన్న సొనాలి బింద్రే

  క్యాన్సర్‌ను ఎదురించడంలో సొనాలి బింద్రే

  క్యాన్సర్‌ను ఎదురించడంలో సొనాలి బింద్రే

  క్యాన్సర్ వ్యాధికి గురైనప్పటికీ దానిని ఎదురించడంలో సొనాలి బింద్రే ఎంతో మనో నిబ్బరాన్ని ప్రదర్శిస్తున్నారు. చాలా ధైర్యంగా ఆమె ఉన్నారు. త్వరలోనే నార్మల్ లైఫ్‌లోకి వచ్చేస్తారు. సొనాలిని చూస్తే నాకు ఎంతో స్ఫూర్తి కలిగింది. చాలా విషయాలు మాట్లాడుకొన్నాం. అనారోగ్యం నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.

  అందుకే కలిశామని

  అందుకే కలిశామని

  బాలీవుడ్‌లో నేను నటించేటప్పటి నుంచే మా ఇద్దరి మధ్య పరిచయం ఉంది. ఆ స్నేహమే మా ఇద్దరిని కలుసుకొనేలా చేసింది. మహారాష్ట్రీయులమనే బంధం చాలా బలంగా ఉంది. గతంలోని సంఘటనలు గుర్తు చేసుకోని చాలా నవ్వుకొన్నాం. సొనాలి చాలా రిలీఫ్‌గా కనిపించింది అని నమ్రత పేర్కొన్నారు.

  ఎక్కువ సేపు గడపలేక పోయాం

  ఎక్కువ సేపు గడపలేక పోయాం

  మా అమెరికా పర్యటన చాలా బిజీ బిజీగా ఉంటంతో సొనాలితో గడిపేందుకు ఎక్కువ సమయం దొరకలేదు. సొనాలి కుమారుడు రణ్‌వీర్, భర్త గోల్డీ బెహల్‌ను నేను, నా కుమారుడు గౌతమ్ కలుసుకొన్నాం. త్వరలోనే సొనాలిని కలిసి ఎక్కువ సేపు గడపుతానని మాటిచ్చాను అని నమ్రత పేర్కొన్నారు.

  స్వచ్ఛంద సంస్థను స్థాపించే ఆలోచనలో

  స్వచ్ఛంద సంస్థను స్థాపించే ఆలోచనలో

  క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకొన్న తర్వాత సొనాలి ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించే ఆలోచనలో ఉన్నారు. దారుణమైన వ్యాధిన పడిన పేదల ఆరోగ్యం కోసం పనిచేస్తాననే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. తన సేవకు అండగా నిలస్తామని వారిద్దరి మధ్య వచ్చిన చర్చల్లో నమ్రత చెప్పినట్టు సమాచారం.

  మహేష్ బాబు సహాకారంతో

  మహేష్ బాబు సహాకారంతో

  సొనాలి స్థాపించబోయే స్వచ్ఛంద సంస్థ కోసం మహేష్ సహకారం కూడా తీసుకోవాలని అనుకొంటున్నట్టు తెలిసింది. నమ్రత సూచన మేరకు మహేష్ బాబు కూడా సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. తెలుగులో మురారీ చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు, సొనాలి కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇంకా ఇంద్ర చిత్రంలో కూడా చిరంజీవిం సరసన జతకట్టింది.

  English summary
  Actor Sonali Bendre recently met former actor Namrata Shirodkar. She said, She is a strong girl. She looks amazingly fit and ready to get back to normal life. I had such a lovely time with her. We discussed so many things. She told me the entire story of her illness and what gives her the strength, and I told her that she’s always in my prayers
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more