»   »  కన్ఫూజన్ లో మహేష్..ఇద్దరూ ఇరుకున పెట్టేసారు

కన్ఫూజన్ లో మహేష్..ఇద్దరూ ఇరుకున పెట్టేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ ఇప్పుడు క్లిష్ట సమస్యలో ఎటూ తేల్చుకోలేని విధంగా ఇరుకున పడ్డాడు. అయితే ఇది సినిమాల విషయంలో కాదు. ఎలక్షన్స్ కి చెందిన ప్రచారం విషయంలో కావటం విశేషం. ఎలక్షన్స్ లో స్టార్స్ క్రేజ్ ని ఉపయోగించుకోవాలని ప్రతీ పార్టీ భావిస్తూంటుంది. దానిలో భాగంగా ఆ స్టార్స్ క్యాంపైన్ కి వస్తారని భావించిన చోట, వారి బంధువులకు సీటు ఇవ్వటానికి ఆసక్తి చూపిస్తూంటారు. దాంతో స్టార్స్ కు తమవారు నిలబడిన చోట ఫ్యాన్స్ చేత ఓటేయించే భాధ్యత మీద పడుతుంది. మహేష్ బాబు మీద అలాంటి భాధ్యత పడింది.

మహేష్ బాబు తండ్రి కృష్ణ గారి సోదరుడు జి.ఆదిశేషగిరిరావు కి వైయస్సార్పీ పార్టీ టిక్కెట్ ఇచ్చింది. మరో ప్రక్క మహేష్ బావ గల్లా జయదేవ్ కి తెలుగుదేశం పార్టీ గుంటూరు సెగ్మెంట్ నుంచి టిక్కెట్ ఇచ్చింది. ఆయన ఇప్పటికే మహేష్ తమ క్యాంపైన్ కు వస్తాడని ప్రకటించి ఉన్నాడు. అలాగని మహేష్ తనకు అత్యంత సన్నిహితుడు అయిన ఆదిశేషగిరిరావుని నిర్లక్ష్యం చేసే స్దితి లేదు. ఇద్దరూ ఒకే పార్టీ అయితే సమస్య లేకపోవును. ఇప్పుడు మహేష్ క్యాంపైన్ కి వెళితే బద్ద శత్రువులు అయిన వైయస్సార్పీకి, తెలుగుదేశంకు ఓట్లేయమని చెప్పాలి. అలా ఓ చోట తిట్టి మరో చోట పొగిడే కార్యక్రమం పెట్టుకోవటం కష్టం. దాంతో ఆయన ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.

Mahesh Babu is confused over choosing any one of these two

ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే... మహేష్‌బాబు - శ్రీనువైట్ల కలయిక మరోసారి 'ఆగడు' సినిమాతో పునరావృతం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పోలీసు పాత్రతో మరోసారి ప్రతాపం చూపించబోతున్నారు మహేష్‌బాబు. ఈ చిత్రంలో మహేష్ తొలిసారిగా రాయలసీమ యాస మాట్లాడుతూ తుపాకీ ఎక్కుపెట్టబోతున్నారు. 'ఆగడు'లో ఆయన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నట్టు సమాచారం. మహేష్‌, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

'దూకుడు' తర్వాత మహేష్‌, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి. మహేష్‌ శైలి వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 26న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... 'ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకుని దిగారు శ్రీను వైట్ల. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు చేసారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో 'ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల,నిర్మాతలు పూర్తి నమ్మకంగా ఉన్నారు. సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: ఎం.ఆర్‌.వర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

English summary
Some actors face stalemate in these elections and this time actor Mahesh Babu seems to have fallen prey to it. G. Adisheshagiri Rao, the younger brother of Super star Krishna and noted film producer, joined the YSR Congress Party. On the other hand Mahesh Babu’s brother-in- law Galla Jayadev got an MP ticket from Telugu Desam party and is contesting polls form Guntur segment.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu