»   » మహేష్ 'నందలాల' ని ఓకే చేసాడంటున్నారు

మహేష్ 'నందలాల' ని ఓకే చేసాడంటున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు 'నందలాల' చిత్రం చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంతటా వినపడుతోంది. రవితేజతో వీర చిత్రం నిర్మించిన శాన్వి ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రం కోసం మహేష్ ని సంప్రదించారని చెప్తున్నారు. నిజానికి తమిళంలో మిస్కిన్ దర్శకత్వంలో రూపొందిన 'నందలాల' చిత్రం మహేష్ బాబుకి బాగా నచ్చి రీమేక్ చేయాలని గతంలో అనుకున్నారు. అలాగే తనకు సన్నిహితుడైన జాస్తి హేమాంభర్ ని దర్శకుడుగా కూడ అనుకున్నారు.అయితే అది కార్య రూపం దాల్చలేదు. అయితే ప్రస్తుతం మహేష్ కంటిన్యూగా సినిమాలు చేసే ప్రాసెస్ లో ఈ సినిమాని ఓకే చేసినట్లు చెప్తున్నారు. ఇక శాన్వి ప్రొడక్షన్స్ వారు ప్రభాస్ తో ఓ చిత్రం, రవితేజ తో శివ కృష్ణ అనే చిత్రం ప్లాన్ చేస్తున్నారు.మరో ప్రక్క మహేష్ దూకుడు చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

English summary
Mahesh Babu has agreed to do another movie titled ’Nandalala’ with Jasti Hemambar and it is a remake of a Tamil film with same name.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu