»   » లాభం..నష్టం :మహేష్ కి అంత...మిగిలేది ఎంత?

లాభం..నష్టం :మహేష్ కి అంత...మిగిలేది ఎంత?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు తాజా సినిమా ‘బ్రహ్మోత్సవం'. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నిమిత్తం మహేష్ కు ఎంత రెమ్యునేషన్ ముట్టనుందని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రానికి మహేష్ బాబు ఈ చిత్రానికి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంత? అనే విషయం బయటకు పొక్కింది.

పోలీసులకి దొరికిన ‘బ్రహ్మోత్సవం' వీడియో గ్రాఫర్లు

పి.వి.పి.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన ఈ చిత్రం నిమిత్తం మహేష్ కు భారీగానే ఆఫర్ చేసినట్లు చెప్తున్నారు. అందుకు కారణం..మహేష్ ని భాగస్వామిగా వద్దనుకోవటమే అంటున్నారు.

మహేష్ బాబు-నమ్రత సీక్రెట్ మ్యారేజ్ 11 (ఫోటోలు)

శ్రీమంతుడు చిత్రం తర్వాత మహేష్ మార్కెట్ రెట్టింపు అయ్యింది. ముఖ్యంగా ఓవర్ సీస్ లో ఆయన మార్కెట్ మిగతా హీరోలకు చెమట్లు పట్టిస్తోంది. ఈ నేఫధ్యంలో ఆయనతో సినిమా అంటే ఖచ్చితంగా ఆ మార్కెట్ ని రీచ్ అయ్యే రెమ్యునేషన్ ఇవ్వాల్సిందే. అయితే శ్రీమంతుడు చిత్రం నుంచి మహేష్... భాగస్వామ్యం అడుగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

టాలీవుడ్లో హయ్యెస్ట్ రెమ్యూరేషన్ తీసకునే హీరో ఎవరు?
ఈ నేపధ్యంలో ఈ చిత్రం ద్వారా మహేష్ కు ఎంత ముట్టింది..ముట్టబోతోంది. పీవీపి వారు మహేష్ డేట్స్ లాక్ చేయటానికి ఇచ్చిన భారీ ఆఫర్ ఏమిటి అనేది ఎప్పుడూ ఆసక్తికరమే ...దాని వివరాలు క్రింద స్లైడ్ షోలో ...

భావించారు

భావించారు

‘బ్రహ్మోత్సవం' చిత్రానికి కూడా ‘శ్రీమంతుడు' తరహాలోనే సహనిర్మాతగా ఉండాలని మహేష్ బాబు భావించారు.

అయితే ....

అయితే ....

మహేష్ బాబు భాగస్వామ్యం ఇష్టం లేని నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి మహేష్ బాబుతో చర్చలు జరిపారట. సినిమాను పూర్థి స్థాయిలో తానే నిర్మిస్తానని చెప్పారట.

ఇదీ డీల్

ఇదీ డీల్

మహేష్ బాబుకు రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసాడని, దీంతో పాటు లాభాల్లో కొంత వాటా ఇస్తానని డీల్ సెట్ చేసారట.

ఇదీ కారణం..

ఇదీ కారణం..

విడుదలకు ముందే ‘బ్రహ్మోత్సవం' బిజినెస్ ఓ రేంజిలో సాగుతోంది. ఈ విషయాన్ని పివీపి వారు పరిగట్టారు.

ఓవర్ సీస్ లో ..

ఓవర్ సీస్ లో ..

‘బ్రహ్మోత్సవం' ఓవర్సీస్ రైట్స్ ఇప్పటి వరకు వచ్చిన తెలుగు సినిమాలన్నింటినీ బీట్ చేసి రూ. 13 కోట్లకు అమ్ముడు పోయింది.

డిమాండ్ కు రీజన్

డిమాండ్ కు రీజన్

‘బ్రహ్మోత్సవం' సినిమాకు ఓవర్సీస్ లో ఇంత డిమాండ్ ఏర్పడటానికి కారణం శ్రీమంతుడు సినిమా ఓవరాల్ గా యుఎస్ లో 18 కోట్లకి పైనే కలెక్ట్ చేయటమే.

శాటిలైట్ ద్వారా

శాటిలైట్ ద్వారా

ఈ చిత్రానికి శాటిలైట్ రైట్స్ కూడా రూ. 12 కోట్లకుపైనే పలుకుతుందని సమాచారం.

రెమ్యునేషన్ రికవరీ..

రెమ్యునేషన్ రికవరీ..

శాటిలైట్, ఓవర్సీస్ రూపంలోనే సినిమాకు రూ. 25 కోట్ల బిజినెస్ అయింది.

అంచనా

అంచనా

థియేట్రికల్ రైట్స్, ఇతర రైట్స్ రూపంలో మరో రూ. 90 కోట్ల బిజినెస్ జరుగడం ఖాయం అంటున్నారు.

బ్యాక్ డ్రాప్

బ్యాక్ డ్రాప్

విజయవాడ బ్యాక్ డ్రాప్ తో సినిమా సాగుతుంది. లవ్, ఫ్యామిలీ నేపధ్యం.

ముగ్గురు హీరోయిన్స్

ముగ్గురు హీరోయిన్స్

మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్స్ సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లు గా నటిస్తున్నారు.

లవ్ స్టోరీకే

లవ్ స్టోరీకే

ఈ సినిమా...ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే దానికన్నా లవ్ ఎంటర్టైనర్ అనటం మేలు అంటున్నారు

లేడీస్ ...

లేడీస్ ...

ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కవగా వున్న మహేష్ మళ్లీ ఖచ్చితంగా సుపర్ హిట్ కొడతాడని అనుకుంటున్నారు.

rn

లాభం..నష్టం :మహేష్ కి అంత...మిగిలేది ఎంత?

ఇప్పటికే విడుదలైన టీజర్

దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల మాట్లాడుతూ....

దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల మాట్లాడుతూ....

''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి సూపర్‌హిట్‌ తర్వాత మహేష్‌తో మళ్ళీ ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది'' అని చెప్పారు.

 పి.వి.పి. సినిమా అధినేత ప్రసాద్‌ వి.పొట్లూరి మాట్లాడుతూ....

పి.వి.పి. సినిమా అధినేత ప్రసాద్‌ వి.పొట్లూరి మాట్లాడుతూ....

వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నామని అన్నారు.

తెరముందు

తెరముందు

మహేష్ బాబు సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, జయసుధ, రేవతి, నరేష్, రావు రమేష్, తనికెళ్ల భరణి, శుభలేఖ సుధాకర్, తులసి, ఈశ్వరీరావు, షాయాజీ షిండే, కృష్ణభగవాన్, రజిత, కాదంబరి కిరణ్, చాందిని చౌదరి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

తెర వెనుక

తెర వెనుక

ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : ఆర్.రత్నవేలు, సంగీతం : మిక్కీ జె. మేయర్, డాన్స్ : రాజు సుందరం, ప్రొడక్షన్ డిజైనర్ : తోట తరణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సందీప్ గుణ్ణం, నిర్మాతలు : పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కథ,స్కీన్‌ప్లే, దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల.

English summary
Mahesh Babu Remuneration for Brahmotsavam has been leaked and guess how much it is. According to latest updates makers have offered Rs. 30 crore for Brahmotsavam Movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu