»   » నిర్మాతకు అలా ఇష్టం లేకే...మహేష్ బాబుతో భారీ డీల్?

నిర్మాతకు అలా ఇష్టం లేకే...మహేష్ బాబుతో భారీ డీల్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్లో హయ్యెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాప్ 3 హీరోల్లో మహేష్ బాబు ఒకరు. మహేష్ బాబు సినిమా విడుదలైతే ఓపెనింగ్స్ రికార్డులు బద్దలు కొట్టే రేంజిలో ఉంటాయి. ఆయనకు యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండటమే ఇందుకు కారణం. ఇక మహేష్ బాబు గత చిత్రం ‘శ్రీమంతుడు'.... బాహుబలి తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

మహేష్ బాబు తాజా సినిమా ‘బ్రహ్మోత్సవం' శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పి.వి.పి.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ ‘బ్రహ్మోత్సవం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయవాడ బ్యాక్ డ్రాప్ తో సినిమా సాగుతుంది. మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్స్ సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లు గా నటిస్తున్నారు.


‘బ్రహ్మోత్సవం' సెట్లో మహేష్ బాబు-సమంత (న్యూ పిక్)


Mahesh Babu's Brahmotsavam remuneration 25 cr

ఈ చిత్రానికి మహేష్ బాబు ఈ చిత్రానికి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంత? అనే విషయం బయటకు పొక్కింది. ‘బ్రహ్మోత్సవం' చిత్రానికి కూడా ‘శ్రీమంతుడు' తరహాలోనే సహనిర్మాతగా ఉండాలని మహేష్ బాబు భావించారు. అయితే మహేష్ బాబు భాగస్వామ్యం ఇష్టం లేని నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి మహేష్ బాబుతో చర్చలు జరిపారట. సినిమాను పూర్థి స్థాయిలో తానే నిర్మిస్తానని చెప్పారట. ఈ మేరకు మహేష్ బాబుకు రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసాడని, దీంతో పాటు లాభాల్లో కొంత వాటా ఇస్తానని డీల్ సెట్ చేసారట.


విడుదలకు ముందే ‘బ్రహ్మోత్సవం' బిజినెస్ ఓ రేంజిలో సాగుతోంది. ‘బ్రహ్మోత్సవం' ఓవర్సీస్ రైట్స్ ఇప్పటి వరకు వచ్చిన తెలుగు సినిమాలన్నింటినీ బీట్ చేసి రూ. 13 కోట్లకు అమ్ముడు పోయింది. ‘బ్రహ్మోత్సవం' సినిమాకు ఓవర్సీస్ లో ఇంత డిమాండ్ ఏర్పడటానికి కారణం శ్రీమంతుడు సినిమా ఓవరాల్ గా యుఎస్ లో 18 కోట్లకి పైనే కలెక్ట్ చేయటమే. ఈ చిత్రానికి శాటిలైట్ రైట్స్ కూడా రూ. 12 కోట్లకుపైనే పలుకుతుందని సమాచారం. శాటిలైట్, ఓవర్సీస్ రూపంలోనే సినిమాకు రూ. 25 కోట్ల బిజినెస్ అయింది. థియేట్రికల్ రైట్స్, ఇతర రైట్స్ రూపంలో మరో రూ. 90 కోట్ల బిజినెస్ జరుగడం ఖాయం అంటున్నారు.

English summary
Mahesh planned to be a partner in Brahmotsavam and even some posters were released which carried 'In association with Mahesh babu Entertainments banner'. However all those were removed after Potluri Vara Prasad held discussions with Mahesh Babu and offered him a whopping Rs 25 crores as remuneration.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu