For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మెమరీస్ కోసం: మొన్న కొడుకు.. ఇప్పుడు కూతురు

  By Srikanya
  |

  హైదరాబాద్‌: ముఖ్యంగా ఎవరైనా పెద్దైన తర్వాత తమ చిన్నప్పటి రోజులను, అప్పటి ఫొటోలను చూసుకోవటానికి ఆసక్తి చూపుతారు. ఆ జ్ఞాపకాల్లోకి వెళ్లాలని సరదాపడతారు. అందుకే చాలా మంది తమ పిల్లల ఫొటోలను , వీడియోలను భద్రపరిచి అమూల్యమైన సంపదగా అందిస్తూంటారు. అదే సినీ సెలబ్రెటీలు అయితే...

  సినిమా సెలబ్రెటీలకు ఓ అవకాసం ఉంది. తమ పిల్లలను తెరపై చూపితే అదే భద్రంగా ఉంటుంది. పెద్దైన వాళ్లు వాటిని చూసుకుని ఆనందపడవచ్చు. అందుకే చాలా మంది నటులు తమ పిల్లలను ఏదో ఒక సినిమాలో గెస్ట్ రోల్స్ లో చూపించటానికి ఉత్సాహం చూపిస్తూంటారు. అభిమానులకు కూడా తమ హీరో పిల్లలు ఇలా తెరపై కనపడటం ఆనందపరిచే విషయమే. ఇప్పుడు మహేష్ బాబు వంతు వచ్చింది.

  మహేష్ బాబు అలాగే ఆలోచించి తన పిల్లలు ఇద్దరినీ సినిమాల్లోకి తీసుకు వస్తున్నారు. సంవత్సవరం క్రితం విడుదలైన 1 నేనొక్కిడినే చిత్రంలో ఆయన తన కుమారుడు గౌతమ్ ని ఇంట్రడ్యూస్ చేసారు. గౌతమ్ పెద్దైన తర్వాత ఆ సినిమా చూసుకుంటే చాలా ఆనందం కలుగుతుందనటంలో సందేహం లేదు. ఇప్పుడు అలాగే తన కుమార్తెను కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్లు వార్త.

  శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం'. ఈ చిత్రంలో మహేశ్‌బాబు కుమార్తె సితార తెరంగేట్రం చేస్తుందన్న వార్త ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ విషయం ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ఇదే నిజమైతే మహేశ్‌ అభిమానులు కచ్చితంగా ఆనందిస్తారని చెప్పవచ్చు.

  ‘బ్రహ్మోత్సవం' చిత్రంలో సమంత, కాజల్‌, ప్రణీతలు హీరోయిన్స్ . ప్రసాద్‌ వి పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేశ్‌బాబు తనయుడు గౌతమ్‌ ‘1' నేనొక్కడినే చిత్రంతో తొలిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

  పూర్తి వివరాలు స్లైడ్ షోలో...

  మహేష్ కూడా...

  మహేష్ కూడా...

  సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్నప్పుడే తెరపై కనిపించి అలరించారు. ఆయన తండ్రి అప్పటి సూపర్ స్టార్ కృష్ణ గారితో కలిసి సినిమాలు చేసారు. ఆ సినిమాలు ఇప్పటికీ ఆయనకీ, ఫ్యాన్స్ కూ మధురానుభూతి.

  బాగా చేసాడని...

  బాగా చేసాడని...

  ఇప్పటికే మహేష్ కొడుకు గౌతమ్ కృష్ణ ఇప్పటికే '1 నేనొక్కడినే' సినిమాలో నటించి ప్రశంసలు కొట్టేసిన నేపధ్యంలో ఇప్పుడు అదే మార్గాన్ని అనుసరించడానికి సితార రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

  ప్రాధాన్యత ఉన్న పాత్ర

  ప్రాధాన్యత ఉన్న పాత్ర

  బ్రహ్మోత్సవం లో ఒక ప్రాధాన్యతతో కూడుకున్న చిన్న అమ్మాయి పాత్ర ఉంది అని, ఎవరైనా జనంలో రిజిస్టర్ అయిన పిల్లల చేయించాలని దర్శకుడు ఆలోచన.

  నమ్రతకు చెప్పాడు

  నమ్రతకు చెప్పాడు


  ఈ పాత్రను శ్రీకాంత్ అడ్డాల మహేష్ కూతురు సితార చేత చేయిద్దామని మహేష్ కు అతడి భార్య నమ్రతకు చెప్పినట్లు తెలుస్తోంది.

  ఆలోచించి నిర్ణయం

  ఆలోచించి నిర్ణయం

  ఊహించకుండా వచ్చిన ఆఫర్ విషయమై మహేష్ దంపతులు ఆలోచించి నిర్ణయం తీసుకుందాం అని శ్రీకాంత్ అడ్డాలతో చెప్పారు.

  తాతకు ఇష్టం

  తాతకు ఇష్టం

  సితార తాత కృష్ణగారు మాత్రం తన మనవరాలు మాత్రం తెరపై చూడాలని ఉందని అన్నట్లు తెలుస్తోంది.

  మనంలాంటి సినిమానే

  మనంలాంటి సినిమానే


  అసలు మనం లాంటి చిత్రం కృష్ణ, మహేష్, గౌతమ్ లతో చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ఆ మధ్యన చేసారని వినికిడి.

  గౌతమ్ కు అవార్డ్..

  గౌతమ్ కు అవార్డ్..

  తొలి సినిమాతోనే గౌతమ్ తన యాక్టింగ్ స్కిల్స్ ను అన్నీ చూపెట్టి మా టీవీ అవార్డు కూడా అందుకున్నాడు.

  అప్పుడే కేక

  అప్పుడే కేక

  మా టీవీ అవార్డు ఫంక్షన్ లో సితార తన కుటుంబ సభ్యులతో వచ్చి అక్కడ డాన్స్ లు కూడ చేసి అందరి దృష్టి ఆకర్షించింది.

  నిద్రపోనివ్వటం లేదు

  నిద్రపోనివ్వటం లేదు

  మహేష్ బాబు నటించిన సినిమాలలోని పాటలు వినకుండా నిద్రపోని 4 సంవత్సరాల సితార చేసే అల్లరికి తాము తట్టుకోలేక పోతున్నాము అంటూ ఈ మధ్యనే మహేష్ ఒక ఇంటర్వ్యూలో కూడ చెప్పాడు.

  English summary
  Super Star Mahesh Babu's son Gautam made his debut with the movie 1-Nenokkadine, it is now the turn of Mahesh Babu's daughter Sitara who will be seen in his forthcoming flick Brahmotasavam.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X