twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు 'మహర్షి' గురించి ఆ రూమర్ నిజమేనా.. బయ్యర్లకు దడపుట్టించేలా!

    |

    Recommended Video

    Mahesh Babu's Maharshi In Problems | Mahesh Babu | Pooja Hedge | Allari Naresh | Vamshi Paidipally

    సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. రైతు సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అశ్విని దత్, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. భరత్ అనే నేను తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం ఇదే కావడంతో మహర్షిపై భారీ అంచనాలు ఉన్నాయి. మహర్షి చిత్రం గురించి చిత్ర పరిశ్రమలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. షూటింగ్, ప్రీరిలీజ్ బిజినెస్ గురించి వస్తున్న వార్తలు అభిమానులని కాస్త కలవరపెట్టే విధంగా ఉన్నాయి.

    ప్రతిష్టాత్మకంగా

    ప్రతిష్టాత్మకంగా

    మహేష్ బాబుకు మహర్షి 25వ చిత్రం. అభిమానులతో పాటు మహేష్ కూడా ఈ చిత్రంపై చాలా ఆసక్తిగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని మంచి సందేశాత్మక అంశలతో తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం మే 9కి వాయిదా పడింది. ఇప్పుడు మరోమారు చిత్ర షూటింగ్ ఆలస్యం అవుతోందంటూ వార్తలు వస్తున్నాయి. మహర్షి షూటింగ్ మొత్తం పూర్తి కావడానికి ఆదివారాలతో సహా మరో మూడు వారాల సమయం పడుతుందని అంటున్నారు.

    సాంగ్స్ షూటింగ్

    సాంగ్స్ షూటింగ్

    కొంత టాకీ పార్ట్, సాంగ్స్ చిత్రీకరణ ఇంకా మిగిలివుంది. టాకీ పార్టీ పూర్తయిన తర్వాత పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ అబుదాబి వెళ్లనుంది. సినిమాని అనుకున్న సమయానికి విడుదుల చేసేందుకు చిత్ర యూనిట్ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. చిత్ర ప్రచార కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించేందుకు మహర్షిని మే 9కి వాయిదా వేస్తున్నట్లు దిల్ రాజు ఇటీవల ప్రకటించారు.

    ‘మహర్షి' మూవీ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది: దేవిశ్రీ అదరగొట్టారు...‘మహర్షి' మూవీ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది: దేవిశ్రీ అదరగొట్టారు...

    ఓవర్సీస్‌లో మహేష్ స్ట్రాంగ్

    ఓవర్సీస్‌లో మహేష్ స్ట్రాంగ్

    ఓవర్సీస్ లో అత్యథిక మార్కెట్ ఉన్న సౌత్ హీరోలలో మహేష్ బాబు ఒకరు. ఓవర్సీస్ లో మహేష్ చిత్రాలు మిలియన్ డాలర్ల వసూళ్లు కురిపిస్తుంటాయి. కానీ ఆశ్చర్యకరంగా మహర్షి చిత్రాన్ని కొనేందుకు ఓవర్సీస్ మార్కెట్ లో బయ్యర్లు ముందుకు రావడం లేదని వార్తలు వస్తున్నాయి. గతంలో మహేష్ నటించిన శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలు యూఎస్ లో అద్భుత విజయం సాధించాయి.

     కారణం ఇదే

    కారణం ఇదే

    మహర్షి చిత్ర నిర్మాతలు ఓవర్సీస్ హక్కులకు 18 కోట్ల ధర డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంత భారీ మొత్తానికి మహర్షి చిత్రాన్ని కొనేందుకు డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రావడం లేదని టాక్. విడుదల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కనీసం 12 కోట్ల ధరకైనా మహర్షి ఓవర్సీస్ హక్కులు అమ్మాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఒకవేళ బయ్యర్లు ముందుకు రాకుంటే నిర్మాతలే సొంతంగా యూఎస్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Mahesh Babu's Maharshi is facing these 2 problems
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X