SSMB 29 రికార్డ్... హాలీవుడ్ సినిమాలకే షాకిచ్చేలా జక్కన్న ప్లాన్.. ఏంటంటే?
ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి నుంచి నెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం SSMB 29. సూపర్ స్టార్ మహేశ్ బాబు తొలిసారిగా జక్కన్న దర్శకత్వంలో నటిస్తుండటం విశేషం. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో ఎప్పుడూ సినిమా రాబోతుందని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎట్టకేళలకు SSMB 29 ప్రాజెక్ట్ పట్టాలెక్కడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ చిత్రం 2025 ఫిబ్రవరి నుంచే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించుకుంది. దీంతో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎప్పుడెప్పుడు అందుతాయా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
కాగా, ఈ సినిమా గురించి తాజాగా మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. ప్రస్తుతం మహేశ్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న SSMB 29 చిత్రం విడుదలపై అందరికీ ఆసక్తి ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం 2027 మార్చిలో విడుదల చేస్తామని మేకర్స్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా గా రూపొందిస్తున్న సంగతి కూడా తెలిసిందే. దీంతో సినిమా ఏ స్థాయిలో విడుదల కాబోతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. దానిపై తాజాగా అప్డేట్ అందింది.

ప్రపంచ యాత్రికుడిగా మహేశ్ బాబు కనిపించ బోతున్నారు. దీంతో సినిమా చిత్రీకరణను కూడా ఎస్ఎస్ రాజమౌళి ప్రపంచంలోని పలు దేశాల్లో షూట్ చేస్తూనే వస్తున్నారు. అయితే ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా 120 దేశాల్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారంట. ఈ విషయాన్ని ప్రస్తుతం SSMB 29 షూటింగ్ ను ఆఫ్రికాలోనూ చిత్రీకరించడంతో ఆ దేశంలోని మినిస్టర్ ఈ విషయాన్ని తెలియజేయడం విశేషం. అయితే ఈ స్థాయిలో తెలుగు చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడం ఇదే తొలిసారి కాబోతుండటం విశేషం.
ఇక హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన రీసెంట్ చిత్రం కిసికా బాయ్ కిసి కా జాన్, షారుఖ్ ఖాన్ పఠాన్, హృతిక్ రోషన్ విక్రమ్ వేద చిత్రాలు కూడా 100 దేశాల్లో ప్రచారం జరిగింది. కానీ ఆ స్థాయిలో విడుదల కాలేదని సమాచారం. ఇక హాలీవుడ్ చిత్రం అవెంజర్ ఎండ్ గేమ్ 85 దేశాల్లో, అవతార్ 2 కేవలం 70 దేశాల్లో మాత్రమే విడుదలైంది. అలాంటిది ఏకంగా జక్కన్న ఎస్ఎస్ఎంబీ 29 చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల్లో విడుదల చేయబోతున్నారనడం గూస్ బంమ్స్ ను తెప్పిస్తోంది.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలను పాన్ ఇండియా సినిమాలుగా విడుదల చేసే రాజమౌళి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. ఇక SSMB 29 చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల్లో విడుదల చేయబోతుండటంతో బాక్సాఫీస్ రికార్డులు చెల్లాచెదురవ్వడం ఖాయమని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 1000 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











