10000 కోట్ల టార్గెట్‌తో రాజమౌళి.. మహేష్ బాబు మ్యాజిక్ వర్కవుట్ అవుతుందా?

సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం SSMB 29. ఈ చిత్రం ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కొనసాగుతోంది. రెగ్యులర్ షూటింగ్ లో ఎలాంటి జాప్యం లేకుండా ఈసారి జక్కన్న ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. కాగా SSMB 29 గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. మహేశ్ బాబుతో వరల్డ్ బాక్సాఫీస్ వద్ద జక్కన్న తెలుగు సినిమా సత్తాను చాటబోతున్నారని అంటున్నారు.

బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలతో పాన్ ఇండియా లెవల్ కు తెలుగు సినిమాను తీసుకెళ్లారు జక్కన్న. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ చిత్రంతో హాలీవుడ్ సర్కిల్స్ లో తెలుగు సినిమాల సత్తాను చాటారు. అంతే కాదు ఆస్కార్ అవార్డ్ ను కూడా టాలీవుడ్‌కు సొంతమయ్యేలా చేశారు. అంతే కాదు బాక్సాఫీస్ వద్ద కూడా రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించి చూపించారు. ఇక నెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న SSMB 29 చిత్రంతో సంచలన రికార్డు క్రియేట్ చేయాలని ధృడ నిశ్చయంతో ఉన్నారు.

Mahesh babu SS Rajamouli SSMB 29 Movie Box Office Expected Collections

SSMB 29 చిత్రంతో వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రూ.10,000 కోట్లను కలెక్ట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారని తెలుస్తోంది. ఆ దిశగా జక్కన్న ఈ భారీ ప్రాజెక్ట్ విషయంలో అడుగులు వేస్తున్నారు. ఎస్ఎస్ఎంబీ 29 చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా, పాన్ వరల్డ్ ఫిల్మ్ గా ఏకంగా 120 దేశాల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసి పోకుండా సినిమాను రూపొందిస్తున్నారు. షూటింగ్ విషయంలోనూ ఆఫ్రికా, కెన్యాతో పాటు ఆయా దేశాలను టచ్ చేస్తూ వస్తున్నారు.

ఇప్పటికే 3 షెడ్యూళ్ల వరకు షూటింగ్ ను కంప్లీట్ చేశారు. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకమైన సెట్ ఏర్పాటు చేసి చిత్రీకరణ జరుపుతున్నారు. మరోవైపు ఆఫ్రికాలో అత్యంత సాహసోపేతమైన స్టంట్స్, యాక్షన్ సీన్లు షూట్ చేస్తున్నారు. ఇక హైదరాబాద్ శివారుల్లో ఒక స్టైలిష్ సాంగ్ ను కూడా షూట్ చేయబోతున్నారని, ఆ సాంగ్ మన హైదరాబాద్ ను వరల్డ్ వైడ్ గా ప్రమోట్ చేస్తుందని అంటున్నారు. ఇలా SSMB 29తో ప్రపంచం వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈ చిత్రానికి Gen43 అనే క్రేజీ టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది.

ఎస్ఎస్ఎంబీ 29 చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ దాస్ రూ.1000 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. కీలక పాత్రలో మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. మరికొంత మంది హాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు ఆస్కార్ అవార్డీ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండటం విశేషం.

More from Filmibeat

Read more about: mahesh babu ss rajamouli ssmb 29
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X