»   » హాట్ టాపిక్ : మహేష్-సుకుమార్... చిత్రం '1 ' కథ ఇదేనా?

హాట్ టాపిక్ : మహేష్-సుకుమార్... చిత్రం '1 ' కథ ఇదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వారం క్రిందట మహేష్,సుకుమార్ చిత్రం టైటిల్ ని '1 నేనొక్కడినే' అని ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ ని వదిలారు. ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ టైటిల్ కి ఫలానా కథ,లీకైందంటూ ఇప్పుడు నెట్ లో ఓ కథ ప్రచారంలోకి వచ్చింది. ఈ కథ నిజమో కాదో కానీ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో వైరల్ లా ఇది స్పీడుగా ప్రచారమవుతోంది.

ఆ కథేమిటంటే...

మహేష్ బాబు...గోవాలో ఓ రాక్ స్టార్..స్టేజ్ సింగర్. అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే అతనికి ఓ భాధాకరమైన గతం ఉంటుంది. దాంతో ఎప్పుడూ అతను కాంట్రావర్శీలకు గురి అవుతూ ఉంటాడు. ఈ లోగా ఇండియాలో టాప్ రిచ్ కిడ్(ఈ పాత్ర గౌతమ్ చేయవచ్చు) కి సంగీతం నేర్పమని ఆఫర్ వస్తుంది. వాళ్లకో కండీషన్ పెట్టి ఒప్పుకున్న మహేష్ పాఠాలు నేర్పుతూ ఉంటాడు.

ఈ లోగా ...మహేష్ గతంలోని విలన్స్ ఆ పిల్లాడ్ని కిడ్నాప్ చేస్తారు. దాంతో పిల్లవాడు మిస్సవటం నింద మహేష్ పై పడుతుంది. సెలబ్రేటీ కావటం, రిచ్ కిడ్ మిస్ కావటంతో ...మీడియాలో అతనే సెంటరాఫ్ ఎట్రాక్షన్ అవుతాడు. తనపై పడిన నింద తొలిగించుకుని, తన నిర్ధోషత్వాన్ని నిరూపించుకోవటానికి మహేష్...పిల్లవాడు కోసం సెర్చ్ మొదలెడతాడు.

లండన్ లో ఆ పిల్లాడు ఉన్నాడని తెలుసుకుంటాడు. ఈ వెతికే క్రమంలో హీరోయిన్ పరచయమవుతుంది. ఆమెతో క్యూట్ రొమాన్స్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో సెకండాఫ్ లో పిల్లవాడు ఎపిసోడ్ వస్తుంది. ఇంతకీ ఎలా పిల్లవాడ్ని రక్షించాడు అనేది మిగతా కథ.

ఆయన సరసన హీరోయిన్ గా మోడల్ కృతి సనన్ పరిచయమవుతోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేశ్ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు కూర్చడం ఇదే ప్రథమం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

సల్మాన్‌ఖాన్ సినిమా 'ఏక్ థా టైగర్'కు పనిచేసిన హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్లు కాన్రాడ్, మార్కోస్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఇందులో మహేశ్ సిక్స్‌ప్యాక్ బాడీతో మొదటిసారి షర్టువిప్పి కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ట్రైలర్ లో కూడా ఆ లుక్ కనపడింది.

English summary
It is known to the audience that Mahesh Babu and Sukumar’s film is progressing with different schedules and a long London schedule is ahead. Gossip mills are abuzz that the story line is a suspense thriller with multiple fight sequences which are going to thrill the audience. The story line that leaked is that Mahesh Babu Searches for a missing person in London and it will end in Hyderabad where Mahesh Babu finds the person. That’s why the long London schedule is planned.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu