»   » మహేష్ బాబు సినిమాలో ఇంటర్నేషనల్ స్టార్ జాకీ చాన్?

మహేష్ బాబు సినిమాలో ఇంటర్నేషనల్ స్టార్ జాకీ చాన్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించిన ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. హాలీవుడ్ స్టార్ జాకీ చాన్ తో కలిసి ఆయన పని చేయబోతున్నారట. మహేష్ బాబు నటించే సినిమాలో ఆయన నటిస్తారని మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పూరి వ్యాఖ్యలు కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి.

ఇటీవల పూరి జగన్నాధ్ మీడియాతో మాట్లాడుతూ....త్వరలో మహేష్ బాబుతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఓ ఇంటర్నేషనల్ స్టార్ కూడా ఉంటారని ఆయన క్లూ ఇచ్చారు. అయితే ఆ స్టార్ ఎవరు? అనేది మాత్రం పూరి వెల్లడించలేదు. అయితే ఆస్టార్ మరెవరో కాదు జాకీ చాన్ అని అంటున్నారు.

 Mahesh Babu To Team Up With Jackie Chan?

బాలీవుడ్ నటుడు సోన్ సూద్ ప్రస్తుతం జాకీ చాన్ తో కలిసి ‘కుంగ్ పూ యోగా' చిత్రం చేస్తున్నాడు. ఇక సోనూ సూద్, పూరి మధ్య మంచి రిలేషన్ షిప్ ఉంది. ఇద్దరూ కలిసి తెలుగులో ‘సూపర్' మూవీ చేసాడు. తర్వాత సోనూ సూద్‌తో బాలీవుడ్లో ‘బుడ్డా హోగా తెరా బాప్' మూవీ చేసాడు.

సోన్ సూద్ ద్వారా జాకీ ఛాన్ తో పూరి జగన్నాధ్ సంప్రదింపులు జరుపుతున్నాడని, మహేష్ బాబు సినిమాలో జాకీ చాన్ తో కీలకమైన పాత్ర చేయించాలని పూరి జగన్నాధ్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సెన్సేషన్ సృష్టించడం ఖాయం.

English summary
According to media reports Mahesh Babu and Jackie Chan might come together for a film. surprisingly, this crazy team up is in consideration for a Telugu project.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu