»   » మహేష్ నిర్ణయం...మిగతా హీరోలు అనుసరిస్తారా

మహేష్ నిర్ణయం...మిగతా హీరోలు అనుసరిస్తారా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు సినిమాలు అరవై నుంచి డబ్బై కోట్లు బడ్జెట్ తో తయారవుతున్న సంగతి తెలిసిందే. మహేష్ గత చిత్రాలు 1,నేనొక్కిడినే, ఆగడు సైతం 70 కోట్లు దాకా అయ్యాయని చెప్పుకొచ్చారు. అయితే రెండు చిత్రాలు భాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయిన నేపధ్యంలో మహేష్ ..బడ్జెట్ కంట్రోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఈ ఎఫెక్టు మహేష్ తాజా చిత్రం శ్రీమంతుడు పై పడిందని తెలుస్తోంది. శ్రీమంతుడు చిత్రం నలభై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ మేరకు మహేష్ సైతం తన రెమ్యునేషన్ ని తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. దాంతో నలభై దాటి ఎంత వచ్చినా నిర్మాత బాగా మిగులు కనపడుతుంది, సేఫ్ ప్రాజెక్టుగా ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. అలాగే...శ్రీకాంత్ అడ్డాలతో చేయనున్న బ్రహ్మాత్సవం కు సైతం బడ్జెట్ ని తగ్గించాలని మహేష్ చెప్పాడని చెప్పుకుంటున్నారు.

ఇది ఫెరఫెక్ట్ గా వర్కవుట్ అయితే మహేష్ తీసుకున్న నిర్ణయం..మిగతా హీరోలు సైతం పాటిస్తారని నిర్మాతలు చర్చించుకుంటున్నారు. దర్శకుడు, హీరోకే ఎక్కువ మొత్తాలు బడ్జెట్ లో వెళ్లిపోతున్న నేపధ్యంలో ఇటువంటి నిర్ణయం పెద్ద హీరో తీసుకోవటం చాలా సంతోషమని,ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తాయని అంటున్నారు.

Mahesh brings budget down to 40 crores

ఈ విషయమై మహేష్ తండ్రి కృష్ణ మాట్లాడుతూ...

ప్రస్తుత చిత్ర పరిశ్రమలో మంచి సినిమాలొస్తున్నాయి. అయితే నిర్మాణ వ్యయమే అదుపు తప్పుతోంది. రూ. 40 కోట్లతో సినిమాలు తీసేయొచ్చు. కానీ 60 కోట్లు, 70 కోట్లు అంటున్నారు. ఆ సినిమాలు విజయవంతమైనా నిర్మాతకి లాభాలు రావడం లేదు అంటున్నారు సూపర్ స్టార్ కృష్ణ.

అలాగే మహేష్‌ నటించిన '1'(నేనొక్కడినే), 'ఆగడు' చిత్రాలకి రూ. 70కోట్లు ఖర్చయ్యాయని అన్నారు. అందుకే ఇప్పుడు చేస్తున్న సినిమా విషయంలో మహేష్‌ జోక్యం చేసుకొంటున్నాడు. నిర్మాణ వ్యయం అదుపు తప్పకుండా అన్నింటినీ తనే పర్యవేక్షిస్తున్నాడు. పారితోషికం కూడా తగ్గించుకొన్నాడు అని చెప్పుకొచ్చారు.

అలాగే పరిశ్రమలో మహేష్‌ నా స్థానాన్ని నిలబెట్టాడు. కథల విషయంలో నాలాగే ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇప్పుడున్నవాళ్లల్లో నా అభిమాన హీరో తనే. మహేష్‌ని జేమ్స్‌బాండ్‌ చిత్రాల్లో చూడాలనే కోరిక ఉంది. అలాంటి కథ తనకి ఎప్పటికి దొరుకుతుందో మరి. మంచి కథ దొరికితే నేను, మహేష్‌, నా మనవడు గౌతమ్‌కృష్ణ కలిసి నటిస్తాం.

ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన 'తేనె మనసులు'తో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు కృష్ణ. ఆ చిత్రం 1965 మార్చి 31న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంటే కృష్ణ సినీ ప్రయాణం నేటితో యాభయ్యేళ్లు పూర్తి చేసుకొంటుందన్నమాట. ఈ సందర్భంగా కృష్ణ మీడియాతో ముచ్చటించింది.

English summary
Probably other Tollywood biggies should also take queue from Mahesh Babu and cut down the making costs of their films big time.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu