»   » '1' (నేనొక్కడినే) ఎ.పి రైట్స్ ఎవరికి? ఎంతకి?

'1' (నేనొక్కడినే) ఎ.పి రైట్స్ ఎవరికి? ఎంతకి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ తాజా చిత్రం '1' (నేనొక్కడినే) . సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఒక పాట మినహా పూర్తైన ఈ చిత్రం ఎపి రైట్స్ ని 55 కోట్లతో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్ధ తీసుకుందని ఫిల్మ్ నగర్ సమాచారం. అయితే ఇది నిజమో కాదో తేలియాల్సి ఉంది. ఇక చివరి పాట 11 డిసెంబర్ నుంచి ముంబైలో మొదలు కానుంది. ఆడియో లాంచ్ డిసెంబర్ 22న కానుంది.

ఇక '1' (నేనొక్కడినే) చిత్రం ఆడియో ఘనంగా చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 22 న ఆడియో పంక్షన్ డేట్ ఫిక్స్ చేసారని సమాచారం. దాదాపు అన్ని తెలుగు ఛానెల్స్ లో ఒకేసారి ఈ చిత్రం ఆడియో టెలీకాస్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పెద్ద సిటీలు,టౌన్స్ లో పెద్ద స్క్రీన్స్ పై ఈ ఆడియోని లైవ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చెస్తున్నట్లు వినికిడి. మహేష్ బాబు ఫ్యాన్స్ ఆ సమయంలో ఇంట్రాక్ట్ అయ్యేలా చూస్తారు.


14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. కృతి సనన్‌ హీరోయిన్. సుకుమార్‌ దర్శకుడు. డిసెంబరులో నిర్మాణానంతర కార్యక్రమాలు ముగించుకొని సంక్రాంతి పండగ నాడు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. 'జనవరి 10న '1'ని తెచ్చేస్తున్నాం' అని మహేష్‌ కూడా చెప్పేశాడు. మహేష్‌కి సంక్రాంతి సీజన్‌ బాగా కలిసొచ్చింది 'ఒక్కడు', 'బిజినెస్‌మేన్‌', 'సీతమ్మ వాకిట్లో' ముగ్గుల పండక్కి విడుదలై విజయాన్ని సాధించాయి. ఇప్పుడు '1' కూడా పండగ బరిలో దిగబోతోంది.

'1' (నేనొక్కడినే) లో మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఛాయాగ్రహణం: రత్నవేలు, పోరాటాలు: పీటర్‌ హెయిన్స్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

English summary
Mahesh Babu’s most awaited movie “1- Nenokkadine” is getting ready to give a grand treat to movie lovers for Sankranthi Next Year. The Shooting of this film is almost completed except the last song which will be canned from 11th December in Mumbai. Now the latest news is the AP rights of this film were bagged by Eros International for a whooping price of Rs.55 Crore. Kriti Sannon is playing female lead role and DSP is scoring music. Sukumar is directing the film produced on 14 Reels entertainment. The audio launch of this film is on December 22nd.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu