»   » ‘బాద్‌షా’ ఎఫెక్ట్: శ్రీనువైట్లకు మహేష్ వార్నింగ్

‘బాద్‌షా’ ఎఫెక్ట్: శ్రీనువైట్లకు మహేష్ వార్నింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఆగడు' చిత్రం కమిటైన సంగతి తెలిసిందే. శ్రీను వైట్ల టాలెంట్‌పై పూర్తిగా నమ్మకం ఉన్నప్పటికీ 'బాద్ షా' మూవీ ఎఫెక్టుతో మహేష్ ఆలోచనలో పడ్డారు. దీంతో సినిమా ప్రారంభానికి ముందే కొన్ని షరతులు విధించాడట.

శ్రీను వైట్ల గత సినిమా 'బాద్ షా' చిత్రం హిట్ టాక్ వచ్చినప్పటికీ చివరకు నిర్మాతకు నష్టాలే మిగిలాయనే ప్రచారం జరిగింది. నిర్మాతతో అనవసర ఖర్చులు పెట్టించి మూవీ బడ్జెట్ భారీగా పెంచడం వల్లనే ఇలా జరిగిందని చాలా మంది వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు శ్రీను వైట్లను కంట్రోల్లో పెట్టాలనే యోచనకు వచ్చాడట.

'ఆగడు' సినిమాను రూ. 40 కోట్ల బడ్జెట్ మించకుండా పూర్తి చేయాలని, అప్పుడే నిర్మాతలకు, బయ్యర్లకు మంచి జరుగుతుందని మహేష్ బాబు సూచించినట్లు తెలుస్తోంది. తన సినిమా నష్టాల పాలైతే తనకే చెడ్డపేరు కాబట్టి మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మహేష్ బాబు ఆలోచన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

ఈచిత్రం మహేష్ బాబు సరసన తమన్నాను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దూకుడు చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ఈచిత్రాన్ని కూడా తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టు దశలోనే ఉన్న ఈచిత్రం వచ్చే ఏడాది మొదలు కానుంది.

English summary
Film Nagar source said that Mahesh has given a warning to Srinu Vaitla. He has reportedly mentioned that while the focus should be there on the comedy and entertainment factor, the budget must not exceed Rs 40 crores. Sources say Mahesh was particular on this after seeing ‘Baadshah’ outcome.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X