»   » మహేష్ ...ధ్రిల్ చేస్తాడట

మహేష్ ...ధ్రిల్ చేస్తాడట

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్, మురగదాస్ కాంబినేషన్ సెట్ అయ్యిన తొలి రోజు నుంచి ఈ సినిమా గురించి రకరకాల ఊహలతో కూడిన కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. తమిళ,తెలుగు మీడియాల రెండింటిలోనూ ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది.

తమిళ మార్కెట్ కోసం మహేష్ చేస్తున్నట్లుగా చెప్పబడుతున్న ఈ చిత్రం ఏ జానర్ లో రూపొందనుంది అనేది ఇప్పుడు కొత్త చర్చనీయాంశం. ఇప్పటివరకూ మీడియాలో ప్రచారమైన వార్తలు ప్రకారం..భారత న్యాయ వ్యవస్ధపై ఈ సినిమా రూపొందుతోందని. అయితే తాజాగా అందుతున్న సమచారం ప్రకారం ఈ సినిమా మురగదాస్ సూపర్ హిట్ తుపాకి తరహాలో సాగనుందని.

విజయ్, మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన తుపాకి చిత్రం చూసిన మహేష్ అటువంటి కథ,కథనంతో అయితే చేస్తానని మురగదాస్ తో అన్నారని చెప్పుకుంటున్నారు. తమిళ భాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం మహేష్ పేవెరెట్ చిత్రాల్లో ఒకటి కావటం విశేషం.

దాంతో మురగదాస్ అలాంటి ధ్రిల్లర్ నేరేషన్ తో సాగే కథతో వచ్చి మహేష్ ఒప్పించాడని చెప్పుతున్నారు. ఏప్రియల్ నుంచి సెట్స్ మీదకు వెళ్లే ఈ చిత్రం మహేష్ ఇప్పటివరకూ చేయని కథ,కధనాలతో ఉండబోతోంది. న్యాయవ్యవస్ధలోని లోపాల ను ఎత్తి చూపుతూ ఈ చిత్రం సాగనుందని తమిళ సినీ వర్గాల భోగట్టా.

MAHESH-Murugadoss FILM...a thriller?

మరో ప్రక్క ఇద్దరు టాప్ ప్రొడ్యూసర్స్ ఈ ప్రాజెక్టుని సెట్ చేసారని సమాచారం. మహేష్ బాబుకు నిర్మాత ఎన్.వి ప్రసాద్ తో చిత్రం కమిట్ మెంట్ ఉంది. అలాగే మురుగదాస్ కు ఠాగూర్ మధు తో సినిమా చెయ్యాలని ఎగ్రిమెంట్ ఉంది. ఈ రెండూ కలిసి వచ్చేలా ఈ ప్రాజెక్టుని ఫైనలైజ్ చేసారని తెలుస్తోంది.

ఇక ఈ ప్రాజెక్టుకు 80 కోట్లు ఖర్చుపెట్టడానికి వీరు సిద్దమైనట్లు సమచాారం. ఇది మహేష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం. విజువల్ గ్రాఫిక్స్ కు ఈ సినిమాలో ప్రయారిటీ లేదు కానీ భారీగా ,రిచ్ గా ఉండాలని మురుగదాస్ నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం మహేష్ చేస్తున్న బ్రహ్మోత్సవం అనంతరం ఈ చిత్రం ఉండబోతోందని చెప్తున్నారు. మరి మురగదాస్ ఈ ప్రాజెక్టుతో ఏం సంచనలం సృష్టించనున్నారో చూడాలి.

English summary
Murugadoss come up with Thupaki kind of thriller subject for Mahesh Babu’s movie and this movie is scheduled to go floors from the month of April.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu