»   » మహేష్, మురుగదాస్ ప్రాజెక్టు ఎప్పటినుంచంటే...

మహేష్, మురుగదాస్ ప్రాజెక్టు ఎప్పటినుంచంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్, మురగదాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంకు సంభంధించిన కథ ఫైనలైజ్ చేసి ఇప్పుడు కాస్టింగ్ మొదలు పెట్టారు. హీరోయిన్ గా శృతి హాసన్ ని ఫైనలైజ్ చేసారు. అలాగే...ఏప్రియల్ రెండవ వారం 2016 నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని సమచారం. ప్రస్తుతం మురుగదాస్ తన బాలీవుడ్ చిత్రం అకిరా తో బిజీగా ఉన్నారు.

ఈ కాంబినేషన్ కొద్ది రోజుల క్రితమే సెట్ అయ్యిందని సమాచారం. ఇద్దరు టాప్ ప్రొడ్యూసర్స్ ఈ ప్రాజెక్టుని సెట్ చేసారని సమాచారం. మహేష్ బాబుకు నిర్మాత ఎన్.వి ప్రసాద్ తో చిత్రం కమిట్ మెంట్ ఉంది. అలాగే మురుగదాస్ కు ఠాగూర్ మధు తో సినిమా చెయ్యాలని ఎగ్రిమెంట్ ఉంది. ఈ రెండూ కలిసి వచ్చేలా ఈ ప్రాజెక్టుని ఫైనలైజ్ చేసారని తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్టుకు 80 కోట్లు ఖర్చుపెట్టడానికి వీరు సిద్దమైనట్లు సమచారం.

ఇది మహేష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం. విజువల్ గ్రాఫిక్స్ కు ఈ సినిమాలో ప్రయారిటీ లేదు కానీ భారీగా ,రిచ్ గా ఉండాలని మురుగదాస్ నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం మహేష్ చేస్తున్న బ్రహ్మోత్సవం అనంతరం ఈ చిత్రం ఉండబోతోందని చెప్తున్నారు. మరి మురగదాస్ ఈ ప్రాజెక్టుతో ఏం సంచనలం సృష్టించనున్నారో చూడాలి.

Mahesh ,Murugadoss film go to sets from April, 2016

మురుగదాస్ గతంలో తమిళంలో తీసిన రమణ చిత్రాన్ని చిరంజీవి తెలుగులో... ‘ఠాగూర్' పేరుతో రీమేక్ చేసారు. తర్వాత మురుగదాస్, చిరంజీవి కాంబినేషన్లో ‘స్టాలిన్' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత ఇద్దరూ కలిసి మరో స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలనుకున్నారు. చిరంజీవిని మైండ్ లో పెట్టుకుని మురుగదాస్ ఓ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసారు.

అయితే చిరంజీవికి ఆ స్టోరీ నచ్చక రిజెక్ట్ చేసారు. మురుగదాస్ అదే స్టోరీని మహేష్ బాబుకు చెప్పాడని, మహేష్ బాబుకు నచ్చడంతో ఓకే చేసారని అంటున్నారు. హైకోర్ట్ వ్యవస్థ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. ఇదే స్టోరీతో ఇపుడు ఇద్దరూ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

English summary
Mahesh Babu, Murugadoss direction bilingual will be going to sets from April, 2016 and currently Murugadoss is busy in completing his Bollywood film ‘Akhira’ with Sonakshi Sinha.
Please Wait while comments are loading...