»   »  మహేష్ , పూరి జగన్నాధ్ కొత్త చిత్రం టైటిల్

మహేష్ , పూరి జగన్నాధ్ కొత్త చిత్రం టైటిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు త్వరలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఓ టైటిల్ ని పూరి జగన్నాథ్ ఫైనలైజ్ చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమచారం. ఆ టైటిల్ మరేదో కాదు...'ఎనిమి' (తెలుగులో శతృవు అని అర్దం). నెగిటివ్ టచ్ ఉండే టైటిల్ పెట్టే పూరి జగన్నాథ్ ఈ టైటిల్ తో ఇప్పటికే స్క్రిప్టు పూర్తి చేసినట్లు చెప్పుకుంటున్నారు. మహేష్ సైతం పూరి ఇచ్చిన నేరేషన్ కు ఇంప్రెస్ అయినట్లు త్వరలో ఈ విషయమై అఫీషియల్ గా ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాసం ఉందని తెలుస్తోంది.

మురుగదాస్ ప్రాజెక్టుతో పాటు ఈ చిత్రం కూడా ఉండే అవకాసం ఉందని తెలుస్తోంది. రీసెంట్ గా తన చిత్రాల జోరు పెంచిన మహేష్ ఈ కొత్త చిత్రం కు సంభందించిన స్క్రిప్టుని లాక్ చేయమని పూరి కి చెప్పినట్లు సినీ వర్గాల భోగట్టా. అతి తక్కువ రోజుల్లో పూరి ఈ ప్రాజెక్టుని ఫినిష్ చేస్తానని మాట ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. గతంలోనూ రికార్డ్ డేస్ లో పూరి , మహేష్ కాంబినేషన్ చిత్రం బిజినెస్ మ్యాన్ రెడీ అయ్యి , విజయం సాధించింది.

ఇక మహేష్ చిత్రాల విషయానికి వస్తే....

మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. పి.వి.పి సినిమా పతాకంపై పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. . తమిళ,తెలుగు భాషల్లో ఈ చిత్రం ఒకే సారి ప్రారంభమైంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. మొదటి ఐదు రోజులు ఓ ఫ్యామిలీ సాంగ్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మహేష్‌తో పాటు ఈ షెడ్యూల్‌లో మిగిలిన ప్రధాన తారాగణమంతా పాల్గొన్నారు. సమంత, కాజల్, ప్రణీత.. ఇలా ముగ్గురు హీరోయిన్లతో తెరకెక్కుతోంది.

 Mahesh ,Puri Jagannadh new movie title

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దర్శకుడు మాట్లాడుతూ ''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తరవాత మళ్లీ మహేష్‌తో ఓ సినిమా చేయడం ఆనందంగా ఉంది. 'నలుగురు ఉన్న చోట ఓ అందం, ఆనందం ఉంటాయి. అలాంటి అనేకమంది ఒక కుటుంబంలో ఉండి ప్రతి సందర్భాన్ని ఓ ఉత్సవంలా జరుపుకొంటే అదే బ్రహ్మోత్సవం. అలాంటి వాతావరణం మా సినిమాలోనూ కనిపిస్తుందు''అన్నారు.

''మా సంస్థ నుంచి వస్తోన్న మరో ప్రతిష్ఠాత్మక చిత్రమిది. వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ''అని నిర్మాతలు చెప్పారు. సత్యరాజ్‌, జయసుధ, రావు రమేష్‌, ప్రకాష్‌రాజ్‌, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు.

ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె.మేయర్‌, కూర్పు: శ్రీకర ప్రసాద్‌, కళ: తోట తరణి

English summary
Mahesh has got one movie lined up with none other than speed director Puri Jagannadh. The latest update on that front is the title has been locked and it is going to be called Enemy. This is the third film in the combination of Mahesh Babu and Puri Jagannadh. Previously both of them acted in Pokiri and Businessman. This third project will excited fans and trade.
Please Wait while comments are loading...