»   » హాట్ టాపిక్ :మహేష్ ‘1’రిలీజ్ వాయిదా

హాట్ టాపిక్ :మహేష్ ‘1’రిలీజ్ వాయిదా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇప్పుడందరి దృష్టీ మహేష్‌బాబు '1' (నేనొక్కడినే) చిత్రంపైనే ఉంది. ఈ చిత్రం టీజర్ విడుదలై మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ నేపధ్యంలో అభిమానులు చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక మొన్నటివరకూ ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల అవుతుందని వార్తలొచ్చాయి. దాంతో సెప్టెంబర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే చిత్రం పూర్తి కావటానికి చాలా కాలం పట్టేటట్లు ఉందని సమాచారం. దాంతో 2014 సంక్రాంతికి సినిమా వాయిదా పడిందని అంటున్నారు. దాంతో ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది.

అయితే మహేష్‌కి సంక్రాంతి అచ్చొచ్చిన పండుగనే విషయం తెలిసిందే. గతంలో మహేష్ సూపర్ హిట్స్ గా నిలిచిన ఒక్కడు, బిజినెస్‌మేన్, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలు సంక్రాంతి కానుకగానే విడుదలయ్యాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొనే నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సంక్రాతికి వాయిదా వేసినట్లు సమాచారం.

ఇక మహేష్ తనయుడు గౌతమ్‌కృష్ణ నటునిగా తెరంగేట్రం చేస్తున్న చిత్రమిది. ఇందులో బుల్లి మహేష్‌గా ఆయన నటిస్తారని తెలుస్తోంది. అలాగే జాక్విలెన్ ఫెర్నాండేజ్ ఐటమ్ సాంగ్ ఈ చిత్రానికి హైలైట్ అవుతోందని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కృతి సనన్ హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. ఇలా పలు ఆకర్షణల సమాహారంగా రూపొందుతోన్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో తెలుసుకోవాలంటే సంక్రాంతి దాకా ఆగాలి .

మరో ప్రక్క చిత్రం కథపై ఇప్పటికే పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో మహేష్ పాత్ర పెక్యులర్‌గా ఉంటుందని, తాను ఒక్కడే అయినా... తన ప్రమేయం లేకుండానే ఇద్దరుగా ప్రవర్తిస్తాడని కొందరంటుంటే... ఇందులో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని మరి కొందరు అంటున్నారు. ఏది ఏమైనా మహేష్.. తన కెరీర్‌లో ఇప్పటివరకూ టచ్ చేయని పాత్ర '1'లో చేస్తున్నట్లు మాత్రం వినపడుతోంది. సాధారణంగా సుకుమార్ సినిమాల్లో హీరోలు ప్రత్యేకంగా ప్రవర్తిస్తుంటారు. మరి ఇందులో మహేష్ పాత్ర చిత్రణ ఎలా ఉంటుందో అనేది ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తున్న అంశం.

English summary

 If latest speculation is to be believed, Super Star Mahesh Babu’s ‘One Nenokkadine’ which was planned on September 28th is postponed to Sankranthi, 2014. As per inner sources, the movie's shoot is going on at slow pace, so there are no chances of releasing the action thriller on scheduled date. On the other hand, Sankranthi is lucky season for Mahesh Babu. He earlier tasted blockbusters for this festival with Okkadu, Businessman and SVSC.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu