»   » ‘బ్రహ్మోత్సవం’పై ‘సర్దార్ ’ రిజల్ట్ ప్రభావం, భయం?

‘బ్రహ్మోత్సవం’పై ‘సర్దార్ ’ రిజల్ట్ ప్రభావం, భయం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్నో హై ఎక్సపెక్టేషన్స్ తో విడుదలైన 'సర్దార్ గబ్బర్ సింగ్ ' చిత్రం భాక్సాపీస్ వద్ద ఫలితం తారుమారు అవటం జరిగింది. ఈ సినిమాకు వీక్ స్టోరీ, వీక్ స్క్రీన్ ప్లే అంటూ పబ్లిక్ గానే జనం విమర్శలు చేస్తున్నారు. అందుకు కథ,స్క్రీన్ ప్లే అందించిన పవన్ కారణం అని దర్శకుడు తప్పేమిలేదని తేలుస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ రిజల్ట్ ని బేస్ చేసుకుని ఫిల్మ్ సర్కిల్స్ లో ఇంకో టాక్ బయిలు దేరింది. మహేష్ 'బ్రహ్మోత్సవం' ఎలా ఉండబోతోందా అనే సందేహంతో ఆ రూమర్ లేవతీస్తున్నారు. ముఖ్యంగా ట్రేడ్ సర్కిల్స్ లో భారీ రేట్లు కొన్న సర్దార్ నుంచి కోలుకోవటానికి టైమ్ పడుతుంది. ఈ లోగా మరో పెద్ద చిత్రం ..బ్రహ్మోత్సవం లాంటిది వస్తే దానికి ఎంతవరకూ బిజినెస్ అవుతుందనే సందేహాలు వెళ్ళబుచ్చుతున్నారు.


Mahesh's Brahmotsavam Fears On Sardar Result?

దానికి తోడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కేవలం మహేష్ స్టామినా మీద ఆడింది కానీ, అందులో కథ,స్క్రీన్ ప్లే ఏమీ లేదు. ఇప్పుడు కూడా అలాంటి మ్యాజికే జరుగుతుందా అంటున్నారు. ఎందుకంటే శ్రీకాంత్ అడ్డాల గత చిత్రం ముకుందా చిత్రం భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ చిత్రానికి కథ ,స్క్రీన్ ప్లే సరిగ్గా కుదరలేదని అప్పట్లో విమర్శలు వచ్చాయి.


వీటిన్నట్టితో పాటు ...కొన్ని నెలల క్రితం బ్రహ్మోత్సవం కథ సరిగ్గా లేదని, మహేష్ మళ్లీ రీ రైట్ చేయించాడని, సెట్ లోనే శ్రీకాంత్ అడ్డాల సీన్స్ డవలప్ చేయటం, పదే పదే స్క్రిప్టు మార్చటం చేస్తూంటే మహేష్ కోపగించాడని మీడియాలో గుప్పు మన్నాయి. అంతేకాదు ఒకానొక సమయంలో మహేష్ సీరియస్ అయ్యి..దర్శకుడుని తప్పు పట్టాడని చెప్పుకున్నారు. అయితే అన్నీ సజావుగా ఉన్నాయని తర్వాత నిర్మాతలు మీడియాకు తెలియచేసారు.

English summary
If Srikanth Addala fails to come with good story, ‘Brahmotsavam’ may meet the same fate of ‘Sardar Gabbar Singh’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu