Just In
- 36 min ago
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటన: అదిరిపోయిన కొత్త పోస్టర్.. ఆ రూమర్లకు కూడా చెక్
- 57 min ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
- 1 hr ago
ప్రభాస్ 'సలార్' హీరోయిన్ ఫిక్స్.. పుట్టినరోజు కానుకగా అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన టీమ్
- 1 hr ago
2021 మొత్తం మెగా హీరోలదే హవా.. నెవర్ బిఫోర్ అనేలా బాక్సాఫీస్ పై దండయాత్ర
Don't Miss!
- Sports
మహ్మద్ సిరాజ్‌కు నాతో చీవాట్లు తినడం ఇష్టం: టీమిండియా బౌలింగ్ కోచ్
- Automobiles
ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి
- News
జగ్గంపేటలో ఘోర ప్రమాదం .. మంటల్లో ఇద్దరు సజీవ దహనం , ముగ్గురికి గాయాలు
- Finance
Gold prices today: వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.7500 తక్కువ
- Lifestyle
తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మేజర్ అజయ్ కృష్ణ: దీనికి ఆ రెండు సినిమాల సెంటిమెంటే కారణం
'మహర్షి' సినిమా సక్సెస్‌తో మాంచి జోష్ మీద ఉన్నాడు సూపర్‌స్టార్ మహేశ్ బాబు. తన గత చిత్రాలు మెసేజ్ ఓరియెంటడ్‌గా తెరకెక్కడంతో.. ఈ సారి పక్కా కమర్షియల్ మూవీ చేయాలని ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగానే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి 'సరిలేరు నీకెవ్వరు' సినిమా చేస్తున్నాడు. ఇందులో మహేశ్ ఆర్మీ మేజర్‌గా కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని ఇటీవల చిత్ర దర్శకుడు అధికారికంగా ప్రకటించాడు.

అనిల్ రావిపూడి క్లారిటీ
ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ‘‘సూపర్‌స్టార్ మహేశ్ బాబు గారు ‘సరిలేరు నీకెవ్వరు' కోసం మేజర్ అజయ్ కృష్ణగా మారారు. కశ్మీర్‌లో సంక్రాంతి 2020 ఆపరేషన్ మొదలైంది'' అంటూ ఆయన ట్వీట్ చేశాడు. దీంతో ఈ సినిమాలో మహేశ్ పాత్రపై క్లారిటీ వచ్చేసింది. వాస్తవానికి అంతకు ముందే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. దీని తర్వాతనే డైరెక్టర్ ఓ ఫొటో వదిలారు.

ఆ రెండు సినిమాలే స్ఫూర్తి
అనిల్ రావిపూడి.. మహేశ్ పాత్ర పేరు బయటకు చెప్పడంతో ఓ ఆసక్తికరమైన అంశం ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అజయ్ కృష్ణ పేరు పెట్టడం వెనుక రెండు సినిమాలు స్ఫూర్తిగా నిలిచాయన్నదే సదరు వార్త సారాంశం. దీని ప్రకారం.. గతంలో మహేశ్ నటించిన సూపర్ హిట్ సినిమాలు ‘దూకుడు', ‘పోకిరి'లో ఏవైతే పాత్రల పేర్లు ఉన్నాయో.. వాటిని కలిపి ‘సరిలేరు నీకెవ్వరు' కోసం వాడుతున్నాడట దర్శకుడు.

సెంటిమెంట్ ప్రకారమేనా..?
‘పోకిరి'లో మహేశ్ కృష్ణ మనోహర్ ఐపీఎస్‌గా కనిపించగా, ‘దూకుడు'లో అజయ్ కుమార్ ఐపీఎస్‌గా నటించాడు. ఈ రెండు సినిమాలూ సూపర్ హిట్ అయ్యాయి. అంతేకాదు, వసూళ్ల పరంగానూ తెలుగు సినిమా రికార్డులను తిరగరాశాయి. దీంతో అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ దర్శకుడు అనిల్ రావిపూడి రెండు పేర్లు కలిసి పెట్టాడని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని చూస్తుందో చూడాలి.

‘సరిలేరు నీకెవ్వరు' గురించి..
మహేశ్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు'ను అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా, ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రాబోతుంది.