Mohanlal Net Worth: మోహన్ లాల్ నికర ఆస్తుల విలువ.. ఎన్ని కోట్లకు అధిపతినో తెలుసా?
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తాజాగా సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే 2023 కిగాను ఎంపికైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 23న ఆయనను కేంద్ర ప్రభుత్వం అవార్డుతో సత్కరించనుంది. మోహన్ లాల్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 45 ఏళ్లుగా యాక్టివ్ గా ఉంటున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, సినిమా డిస్ట్రిబ్యూటర్ గా, సింగర్ గా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కీలకమైన బాధ్యతలను నిర్వర్తించారు.
ఇక మోహన్ లాల్ ఆయన కెరీర్ లో 400 సినిమాల్లో నటించి మెప్పించారు. మలయాళ చిత్ర పరిశ్రమతో పాటు, టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమల్లో కూడా పనిచేశారు. దీంతో మోహన్ లాల్ కు దేశవ్యాప్తంగా అగ్ర నటుడిగా పేరు దక్కింది. 65 ఏళ్లలో కూడా ఆయన విరామం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండియన్ ఆడియన్స్ను అలరిస్తున్నారు. యాక్షన్ చిత్రాలతోనూ అదరగొడుతున్నారు. కాగా, మోహన్ లాల్ తన నట జీవితంలో ఎన్ని కోట్లు సంపాదించారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పలు నివేదికల ప్రకారం.. మోహన్ లాల్ సంపాదన వందల కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది. మోహన్ లాల్ తన సినిమాలకు కేవలం 30 కోట్ల వరకు చార్జి చేస్తుంటారు. ఇక మొదటి నుంచి మోహన్ లాల్ తన సంపాదన మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ వచ్చారు. ఆయనకు కొచ్చిలో ఒక పెద్ద హాస్పిటల్ ఉంది. అలాగే కేరళ తో పాటు ఇతర రాష్ట్రాల్లో మోహన్ లాల్ కు చాలా సంఖ్యలో రెస్టారెంట్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇక కొచ్చిలోనే ఆయనకు ఒక లగ్జరీ థియేటర్లో కూడా ఉండడం విశేషం.
అలాగే అత్యంత ధనికులు వాడే రోల్స్ రాయిస్ కారు, మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎంజీ, పోర్స్చే కయెన్, బీఎండబ్ల్యూ ఎక్స్5, బోట్స్ కూడా ఉండటం విశేషం. అంతే కాకుండా కొచ్చి నగరంలోని కుందనూర్‌లో ఒక విలాసవంతమైన డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కూడా ఉంది. 9,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇల్లు కోట్ల విలువను కలిగి ఉంటుంది. అలాగే కొచ్చిలోని తేవారాలో ఒక విలాసవంతమైన విల్లాను కూడా ఆయన సొంతం చేసుకున్నారు. మరోవైపు కొచ్చిలోని ఐడెంటిటీ బిల్డింగ్ కాంప్లెక్స్‌లోని 15వ, 16వ అంతస్తులో ప్లాట్స్ కూడా కలిగి ఉన్నారు.
మరోవైపు మోహన్ లాల్‌కు ప్రణవం ఆర్ట్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ, మ్యాక్స్ సినిమాస్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ థియేటర్స్, ప్రీ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ విస్మయాస్ మ్యాక్స్ కూడా ఉంది. ఇలా మోహన్ లాల్ ఏడాది కోట్లట్లో ఆదాయాన్ని సంపాదిస్తూ ఉంటారు. ఈ ఆస్తులన్నింటి నిఖర విలువ రూ.470 కోట్లకు పైగానే ఉంటుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక మలయాళం చిత్ర పరిశ్రమలో అత్యధిక ధనవంతుడిగానూ మోహన్ లాల్ పేరే వినిపిస్తుండటం విశేషం. ఆయన కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ కూడా హీరోగా గట్టగానే సంపాదిస్తున్నారు. హృదయం చిత్రంతో ఇండియా మొత్తం ఆయన గుర్తింపు దక్కించుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











