»   » క్లోజ్ ప్రెండ్ ని నమ్మి రెండు కోట్లు మోసపోయిన తెలుగు యంగ్ హీరో

క్లోజ్ ప్రెండ్ ని నమ్మి రెండు కోట్లు మోసపోయిన తెలుగు యంగ్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

మోహన్ బాబు కుమారుడు మంచువిష్ణు రీసెంట్ గా తన క్లోజ్ ప్రెండ్ చేతిలో మోసపోయారని తెలుస్తోంది. దాంతో మిత్ర ద్రోహానికి భయపడిన విష్ణు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా దూరం పెడుతున్నారని చెప్తున్నారు. వివరాల్లోకి వెళ్తే తన స్కూల్ నాటి నుంచి క్లోజ్ ప్రెండ్ అయిన ఓవ్యక్తిని నమ్మి తనకు చెందిన ఓ కంపెనీ బాధ్యతలను అతను చేతిల్లో పెట్టారు విష్ణు. మొదట్లో బాగానే ఉన్నా ఈమధ్య కాలంలో సంస్థ లాభాల్లో ఉన్నా దాదాపు రెండుకోట్లు నష్టం వచ్చిందని లెక్కలు చూపాట్ట.దాంతో విష్ణు షాక్ అయ్యాడు.

దీంతో తనే స్వయంగా ఎకౌంట్స్ అన్నీ దగ్గరుండి పరిశీలించడంతో దొంగ దొరికిపోయాడు. అయితే ఈ విషయం బయటకు వస్తే తనకే మచ్చగా మారుతుందని,నలుగులో ఇదో టాపిక్ గా మారుతుందని, విష్ణు ఎవరికి చెప్పకుండా మిన్నకుండిపోయారు. అంతేకాకుండా తన తండ్రి మోహన్ బాబుకు సైతం అతన్ని బయిటకు పంపాకే చెప్పి,అతన్ని ఏమి అనొద్దని,అల్లరి అవుతుందని రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం. ఆ వ్యక్తి ఇప్పుడు ఆయన దిల్ రాజుకు చెందిన సంస్థలో జాయిన్ అయినట్లు పరిశ్రమ వార్త.అతని పేరు అశోక్ కుమార్ రాజు అని అంతటా వినపడుతోంది.

English summary
Manchu Vishnu was cheated by his school friend. Vishnu, believing his childhood friend put one of his companies in his hands.The company showed Rs 2 crore despite earning profits in the recent past.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu