twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మణికర్ణిక' టైటిల్ తో క్రిష్ నెక్ట్స్ చిత్రం, పూర్తి డిటేల్స్

    క్రిష్ తన తదుపరి చిత్రాన్ని హిందీలో చేయనున్నట్లు తెలుస్తోంది.

    By Srikanya
    |

    హైదరాబాద్ : రీసెంట్ గా నందమూరి బాలకృష్ణను గౌతమీ పుత్ర శాతకర్ణిగా చూపించి మెప్పించారు దర్శకుడు క్రిష్. ఆ చిత్రం అద్భుత విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత క్రిష్ నుండి కొత్త సినిమా ప్రకటన ఇంకా రాలేదు . వెంకటేష్, క్రిష్ కలయికలో ఓ సినిమా ప్లాన్ జరిగింది.

    వెంకీ కోసం క్రిష్ 'అతడు అడవిని జయించాడు' చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నారు. కేశవరెడ్డి రచించిన ఈ నవలకు చాలా అవార్డులు వచ్చాయి. ఈ నవల కాపీ రైట్స్ తీసుకోవాలని అనుకున్నారు క్రిష్. కానీ ఇంతలోనే మరో వ్యక్తి ఆ నవల హక్కులను సొంతం చేసుకోవడంతో వెంకీ సినిమా డ్రాప్ అయింది.

    అయితే దర్శకుడు క్రిష్.. మరో దృశ్య కావ్యానికి తెరరూపం ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని బాలీవుడ్ మీడియా కథనం. క్రిష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై బాలీవుడ్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గౌతమిపుత్ర శాతకర్ణితో తెలుగు చక్రవర్తి కథకు రూపం ఇచ్చిన క్రిష్, మరోసారి ఓ భారీ చారిత్రక చిత్రం రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో... భారత చరిత్రలో ధీరవనితగా గుర్తింపు తెచ్చుకున్న రాణీ లక్ష్మీబాయ్ జీవితాన్ని సినిమాగా రూపొందించనున్నాడని అక్కడి టాప్ పత్రిక రాసుకొచ్చింది.

    'Manikarnika' title for Krish next movie!

    అంతేకాదుబాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ కంగనా రనౌత్ ఈ సినిమాలో లక్ష్మీబాయ్ గా నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు లక్ష్మీబాయి పుట్టినప్పటి పేరు 'మణికర్ణిక'ను టైటిల్ గా ఫిక్స్ చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి కథని రాజమౌళి తండ్రి అయిన విజయేంద్రప్రసాద్ ఇస్తున్నారంటున్నారు. బాహుబలి రచయిత నుంచి వస్తున్న కథ కాబట్టి ఖచ్చితంగా క్రేజ్ వస్తుందని అంటున్నారు.

    ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మే నెల రెండో వారంలో ప్రారంభించనున్నారు. బాలీవుడ్ లోని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బాలీవుడ్ లో 'గబ్బర్ ఈజ్ బ్యాక్' సినిమాతో సక్సెస్ సాధించిన క్రిష్, మణికర్ణికతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.

    English summary
    Director Krish, is reportedly gearing up to direct another historical, the biopic of Rani Lakshmi Bai, also called the 'Rani of Jhansi'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X