»   » మహేష్,మురగదాస్ చిత్రం టైటిల్ అంటూ మరొకటి తెరపైకి, ఇదైనా ఫిక్స్ చేస్తారా?

మహేష్,మురగదాస్ చిత్రం టైటిల్ అంటూ మరొకటి తెరపైకి, ఇదైనా ఫిక్స్ చేస్తారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్‌స్టార్‌ మహేష్ బాబు హీరోగా ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రిలీజ్ డేట్ కూడా ని కూడా మురగదాస్ ప్రకటించారు కానీ, టైటిల్ విషయమై క్లారిటీ రావటం లేదు. ఇప్పటికే ఈ చిత్రం కు టైటిల్ అంటూ రకరకాల టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే అవేమీ కాదని, కొత్తగా మరో టైటిల్ తెరమీదకు వచ్చింది. ఆ టైటిల్ ఏమిటీ అంటే..." మర్మం".

అయితే, ఈ టైటిల్ పై ఇప్పటివరకు ఎవరూ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. మహేష్ బాబు మూవీ టైటిల్‌పై ఇప్పటివరకు పెదవి విప్పని మురుగ ఇకనైనా ఈ విషయంపై స్పందిస్తాడా లేదా అనేదే ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

మరో ప్రక్క ఈ చిత్రాన్ని జూన్‌ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు రీసెంట్ గా మురుగదాస్‌ సోషల్‌మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిత్రం ఆడియో రిలీజ్ డేట్ ఎప్పుడనే విషయం అందరిలో ఆసక్తికరంగా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం ఉగాది పండగ సందర్భంగా సినిమా టైటిల్ ను, ఫస్ట్‌లుక్‌ని, మే 31న (సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు)న పాటల్ని విడుదల చేసే అవకాశాలున్నాయి.

Marmam:Mahesh Babu-Murugadoss Film Title Fixed ?

మహేష్-మురుగదాస్ చిత్రం తెలుగు, తమిళం భాషలలో విడుదల కానుండగా తమిళంలో సంభవామి యుగేయుగే అంటూ ఈ చిత్రానికి ప్రచారం జరుగుతోంది. తెలుగులో మాత్రం ...మర్మం టైటిల్ తో ఈ సినిమా విడుదల కానుందని అంటున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో మహేష్‌-ఫారిన్ డాన్సర్స్ పై ఓ పాటని చిత్రీకరిస్తున్నారు. శోభి మాస్టర్‌ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు.
మహేష్ బాబు ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ పాత్ర పోషిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎస్‌.జె. సూర్య విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఎన్‌.వి.ప్రసాద్‌, ఠాగూర్‌ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీతం: హారిస్‌ జైరాజ్‌, ఛాయాగ్రహణం: సంతోష్‌ శివన్‌.

English summary
The rumours about the title of the Mahesh23 film has been creating a rage over the internet. After two titles “Sambhavami” and “Agent Shiva”, now another title called ‘Marmam’. has been doing the rounds in the industry. Marmam is a Sanskrit word, which means mystery. This title is also yet to be confirmed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu