»   » వరుణ్ సందేశ్ 'మరో చరిత్ర' క్లైమాక్స్ ఏమిటంటే

వరుణ్ సందేశ్ 'మరో చరిత్ర' క్లైమాక్స్ ఏమిటంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరుణ్ సందేశ్, అనిత కాంబినేషన్లో దిల్ రాజు నిర్మిస్తున్న మరో చరిత్ర రీమేక్ త్వరలో రిలీజ్ కావటానికి రెడీ అవుతోంది. అయితే ఈ చిత్రంలో ఉన్న క్లైమాక్స్ ని ఒరిజనల్ లో ఉన్నట్లుగా విషాదాంతం చేస్తారా లేదా అన్నది ఈ చిత్రం ప్రారంబించిన నాటినుంచి అందరిలో సందేహం నెలకొంది. అయితే ఈ చిత్రంకు హ్యాపీ క్లైమాక్స్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తం యుఎస్ లో జరుపుకున్న ఈ చిత్రంలో హీరో, హీరోయిన్స్ ఇద్దరూ చివరకు సంతోషంగా కలుసుకుని తమ జీవితాన్ని కొనసాగిస్తారు. ఇక బాలీవుడ్ హిట్ రేస్ వంటి చిత్రాలకు కెమెరా అందించిన రవి యాదవ్ ఈ చిత్రాన్ని బ్రీత్ టేకింగ్ విజువల్స్ తో నింపేసారని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం పోస్టర్స్ పై హృతిక్ రోషన్ కైట్స్ డిజైన్ ని అనుసరించటమే బాదాలేదని చెప్పుకుంటున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu