»   »  మారుతి నెక్ట్స్ ఆ యంగ్ హీరోతో ఖరారు

మారుతి నెక్ట్స్ ఆ యంగ్ హీరోతో ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ రోజుల్లో చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన మారుతి ఓ విధంగా చిన్న చిత్రాలకు ఊపు తెచ్చారు. మొదట్లో బూతు చిత్రాల దర్శకుడు అనిపించుకున్నా ఇప్పుడు తన శైలి మార్చుకునే పనిలో పడ్డారు. తాజాగా ఆయన రూపొందించిన 'కొత్త జంట' చిత్రం రిలీజ్ కు సిద్దంగా ఉంది. వెంకటేష్ తో అనుకున్న రాధ ప్రాజెక్టు ఆగిపోయినా ఇప్పుడు అదే నిర్మాతతో నితిన్ హీరోగా చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు నితిన్ కి ఓ రొమాంటిక్ కథ చెప్పి ఒప్పించాడని, ఆ కథతో నితిన్ తన తాజా చిత్రం ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించున్నారు.

ఈ ప్రాజెక్టు ఇమ్మీడియట్ గా పట్టాలు ఎక్కటానికి ఓ కారణం ఉంది. ఇష్క్ హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన నితిన్ వరసగా సినిమాలు చేసే ప్రాసెస్ లో రీసెంట్ గా ఓ చిత్రం ఓపెన్ అయ్యింది. తన సొంత సంస్ధ లో ఈ చిత్రం నిర్మాణం ప్రారంభించారు. ఈ చిత్రానికి సురేంద్రరెడ్డి శిష్యుడైన శ్రీనివాస్ దర్శకుడు గా మొదలెట్టారు. కానీ క్రియేటివ్ డిఫెరెన్సిస్ వల్ల చిత్రం ఆగిపోయింది. ఈ స్లాట్ లో నితిన్ డేట్స్ వృధా చేయటం ఎందుకుని మారుతి చిత్రం ను పట్టాలు ఎక్కిస్తున్నారు.

 Maruthi to direct Nitin's next

మరో ప్రక్క నితిన్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ ఫోటాన్‌ కథాస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పెై తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న 'కొరియర్‌ బోయ్‌ కళ్యాణ్‌' చిత్రం షూటింగ్ పూర్తి అయ్యి రిలీజ్ కి రెడీగా ఉంది. ప్రభుదేవా వద్ద అసోసియేట్‌గా పనిచేసిన ప్రేమ్‌సాయి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో ఈ చిత్రం 'తమిళ సెల్వనుం తనియార అంజలుం' పేరుతో ఈ చిత్రం రూపొందబోతోంది. నిర్మాత గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ మాట్లాడుతూ 'ఈ చిత్రంలో లవ్‌, యాక్షన్‌, కామెడీ అన్నీ సమపాళ్లలో ఉంటాయి. సింగర్‌ కార్తీక్‌ ఈ చిత్రానికి మంచి సంగీతం అందిస్తున్నాడు.

English summary
Maruthi who tasted good success with Ee Rojullo, Bus Stop has bagged big film. Producer DVV Danayya gave him a big offer to direct hero Nitin who is basking in the success of Ishq.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu