»   » మారుతి నెక్స్ మెగా హీరో తో.. ఆ ఇద్దరిలో ఎవరో మరి?

మారుతి నెక్స్ మెగా హీరో తో.. ఆ ఇద్దరిలో ఎవరో మరి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు మారుతి కి, మెగా క్యాంప్ కు మంచి రిలేషన్ ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఇద్దరూ ఆయన్ను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. నమ్మి అల్లు శిరిష్ ని సైతం ఆయన చేతిలో పెట్టారు. కొత్త జంట హిట్ కాకపోయినా బాగా తీసాడనే పేరు వచ్చింది. అయితే ఇప్పుడు ఆయన ఫామ్ లో ఉన్న మెగా హీరోతో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కెరీర్ ప్రారంభంలో వచ్చిన బూతు చిత్రాల దర్శకుడు అనే ముద్రను వదిలించుకుని మినిమం గ్యారెంటీ దర్శకుడు, కామెడీ బాగా పండిస్తాడు అనే బ్రాండ్ ని అందుకున్న దర్శకుడు మారుతి. నాని తో చేసిన 'భలే భలే మగాడివోయ్' హిట్టవటంతో ఇండస్ట్రిలో అందరి దృష్టీ ఆయనపైనే.

Maruthi To Direct Sai Dharam Tej

మారుతి ప్రస్తుతం వెంకటేష్ హీరో గా 'బాబు బంగారం' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత మారుతి మెగా క్యాంప్ కు చెందిన ఓ యంగ్ హీరో సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు తెలిసింది.

అయితే అల్లు అర్జన్ తోనా, సాయి ధరమ్ తేజ తోనా అనేది మాత్రం క్లారిటీ లేదు. బాబు బంగారం రిజల్ట్ బాగుంటే అల్లు అర్జున్ సైతం ఓ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చేయమని డేట్స్ ఇస్తాడని చెప్పుకుంటున్నారు. పెద్ద హీరోని మారుతి ఎలా డీల్ చేసాడనే విషయం బాబు బంగారంతో తేలనుంది.

Maruthi To Direct Sai Dharam Tej

అయితే మరో ప్రక్క మారుతి..రీసెంట్ గా సాయి ధరమ్ తేజను కలిసి కథ చెప్పారని సమాచారం. సాయి ధరమ్ తేజ, మారుతి కలిసి ఈ మధ్యన కొబ్బరిమట్ట టీజర్ రిలీజ్ పంక్షన్ లోనూ కలిసారు. సాయి ధరమ్ తేజ కూడా మాస్ ఎంటర్టైనర్ చేయాలనే ఉత్సాహంతో మారుతి కథ కు సై అన్నాడని చెప్పుకుంటున్నారు.

అల్లు అర్జున్ తో సినిమా అంటే ఎంత లేదన్నా ఇంకో సంవత్సరం పట్టే అవకాసం ఉంది కాబట్టి ఈ లోగా సాయి ధరమ్ తేజ తో ముందుకు వెళ్లిపోతాడనే టాక్ నడుస్తోంది. 'సుప్రీమ్' హిట్ తరువాత సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం 'తిక్క' సినిమాలో నటిస్తున్నారు.

English summary
Director Maruthi has met and narrated a story to Sai Dharam Tej recently. The official confirmation is yet to known but closed sources say that story has been okayed by hero.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu