»   » నిజమా రూమరా...!? రవితేజ సినిమాలు ఆపేస్తాడా???

నిజమా రూమరా...!? రవితేజ సినిమాలు ఆపేస్తాడా???

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవలి కాలంలో రవితేజకు కాలం కలిసిరాలేదు, మాస్ రాజా నటించిన చిత్రాలు ఒకదాని వెనుక ఒకటిగా వరుసపెట్టి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ఆ తర్వాత ప్రముఖ నిర్మాత దిల్ రాజు వద్ద రెమ్యునరేషన్ విషయంలో పెద్ద వివాదమే జరిగింది. ఈ వివాదం సద్దుమణిగిన తర్వాత కూడా బెంగాల్టైగర్ దారుణమైన దెబ్బకొట్తటం తో మొత్తంగా డీలాపడ్డాడు రవితేజ, ప్రస్తుతానికైతే రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు, అదీ చాలాగ్యాప్ తర్వాత చేస్తున్న ఈ రెండు సినిమాలు కూడా గత అనుభవాలనే మిగిలిస్తే గనక ఇక నటనకు గుడ్బై చెప్పేసే ఆలోచహనలో ఉన్నాడని అనుకుంటున్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తోంది.....

రవితేజ' ఫిల్మ్ రికార్డు చూస్తే

రవితేజ' ఫిల్మ్ రికార్డు చూస్తే

సినిమా ఇండస్ట్రీ లో బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన నటుడు 'రవితేజ'. తన యాక్టన్ తో మాస్ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసిన రవితేజ మాస్ మహారాజా అని బిరుదు కూడా కొట్టేసాడు. కానీ కొంత కాలం నుండి 'రవితేజ' ఫిల్మ్ రికార్డు చూస్తే ఒక్క పర్ఫెక్ట్ హిట్ కూడా కనపడదు. అసలు కొన్ని సినిమాలు అయితే ఎందుకు చేసాడో కూడా అర్ధం కాదు.

వెనక పడ్డాడు

వెనక పడ్డాడు

సెంటిమెంట్ ని కామెడీ ని యాక్షన్ ని క్యాజువల్ వేలో ప్రెజెంట్ చేసే రవితేజ ఘోరంగా వెనక పడ్డాడు. హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్స్ తో చేసిన సినిమాలు కూడా అంతగా ఆడలేదు. కొత్తదనం లేని కధ, కట్టిపడెయ్యలేని కధనం, రొటీన్ కామెడీ, మోనాటిని ఎక్స్ప్రెషన్స్ ఇలా ఎన్నో కారణాలు మాస్ మహారాజని డౌన్ చేసాయి.

ఒక్క సినిమా కూడా చెయ్యకుండా

ఒక్క సినిమా కూడా చెయ్యకుండా

గత సంవత్సరం కేవలం ఒక్క సినిమా కూడా చెయ్యకుండా సైలెంట్ గా వరల్డ్ టూర్ కి వెళ్ళాడు రవితేజ. ఒకప్పుడు కలక్షన్స్ కురిపించిన ఈ హీరో ఎంట్రీ తడబాటు లో పడింది. ఐన సరే అది గతం. ఇప్పుడు మాస్ మహారాజ్ రెండు వెరైటీ సినిమాలతో మళ్ళీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.

విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో

విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో

'టచ్ చేసి చూడు' అనే టైటిల్ తో ఒక సినిమా రాబోతుంది. టైటిల్ లోనే మాస్ ఎలిమెంట్ కనిపిస్తున్న ఈ సినిమా మీద 'రవితేజ' హోప్స్ పెట్టుకున్నాడు. విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో వస్తున్న 'టచ్ చేసి చూడు' సినిమా వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో 'రవితేజ'తో పాటు 'లావణ్య త్రిపాఠి', 'రాశిఖన్నా' నటిస్తున్నారు.

రాజా ది గ్రేట్

రాజా ది గ్రేట్

దిల్ రాజు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో 'రవితేజ' హీరోగా వస్తున్న మరో సినిమా 'రాజా ది గ్రేట్'. ఈ సినిమా లో 'రవితేజ' అంధుడిగా నటిస్తున్నాడు అని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. స్టోరీ లైన్ సస్పెన్సు మైంటైన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఏది ఏమైనా 'రవితేజ'కి ఈ ఇయర్ రెండు సినిమాలు రెడీ గా ఉన్నాయ్.

ఇటీవలి కాలంలో రవితేజ

ఇటీవలి కాలంలో రవితేజ

ఇటీవలి కాలంలో రవితేజ సినిమాలు విడుదల కాలేదు. విడుదలైన ఒకటి రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టాయి. దాంతో చాలా గ్యాప్‌ తీసుకుని రవితేజ ఓ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు కూడా గత అనుభవాలనే మిగిలిస్తే ఇక నటనకు స్వస్తి చెప్పి డైరక్టర్‌గా అవతారం ఎత్తాలన్నది రవితేజ ఆలోచనట!

కెరీర్‌ గాడిలో పడుతుంది అని

కెరీర్‌ గాడిలో పడుతుంది అని

రవితేజ మొదట్లో దర్శకత్వ శాఖలో పనిచేసే నటన వైపు వచ్చాడు. సో...తనకు పరిచయమున్న దర్శకత్వం వైపు వెడితే కెరీర్‌ గాడిలో పడుతుంది అని రవితేజ ఆలోచన అట అయితే ఇంకో పక్క తన స్పీడ్ పెంచి ఇంకా కధలు వింటున్నాడు అని కూడా ఇంకో వార్త వినిపిస్తోంది.

తర్వాత ఏం చేయబోతున్నాడు

తర్వాత ఏం చేయబోతున్నాడు

మొత్తానికి ఈ మాస్‌హీరో తర్వాత ఏం చేయబోతున్నాడూ అనేది ఆ రెండు సినిమాలు వచ్చి వాటి సంగతేమిటన్నది తెలిస్తే తప్ప ఒక పక్కా క్లారిటీ మాత్రం రాలేం. ఒక వేళ సినిమాలు గనక మాంచి హిట్ ని గనక ఇవ్వగలిగితే మరో సారి రవితేజ అంటే ఏమిటో చూడొచ్చు.

అసిస్టెంట్ డైరెక్టర్ గా

అసిస్టెంట్ డైరెక్టర్ గా

ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గానే చిత్రసీమకు పరిచయమయ్యాడు రవితేజ.అప్పట్లో కొన్ని కధలు కూడా రాసుకున్న ఆయన డైరెక్షన్ గురించి కూడా సీరియస్ గా ఆలోచిస్తున్నాడు అన్న మాటని కూడా పక్కన పెట్తలేం కానీ... నటనా..?, డైరెక్షనా..? అన్న ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవాల్సి వస్తే మాత్రం రవితేజ దేన్ని ఎంచుకుంటాడో మనకు తెల్సిందే. మాస్ హీరో తెరమీదే కనపడాలనేది అభిమానుల కోరిక కూడా...

English summary
an Intrusting news is roming in Tollywood that Mass Maharaja Ravi Teja will take a divershan about Direction
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu