»   » త్రిష బ్రేకప్ కు అసలు కారణాలు ఇవా?

త్రిష బ్రేకప్ కు అసలు కారణాలు ఇవా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : త్రిష..ఫియాన్సి వరుణ్, త్రిష లు బ్రేకప్ అయినట్లే అని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దానికి తోడు రీసెంట్ గా ట్వీట్ల వార్ ప్రారంభమై అది తిట్టుకోవటంతో ...పరాకాష్టకు చేరింది. వీరి బ్రేక్ అప్ కు మీడియాలో రకరకాల కారణాలు వినపడుతున్నాయి. అయితే తాజాగా ఓ రెండు ముఖ్యమైన కారణాలను తమిళ మీడియా ముందుకు తీసుకొచ్చింది. అవేమిటంటే....

1 త్రిష...అత్త మామలు...ఆమె సినిమాల్లో కంటిన్యూ అవటం ఇష్టం లేదు..ముఖ్యంగా ఎంగేజ్మెంట్ అయ్యాక. అయితే తర్వాత ఆమె వరసగా సినిమాలు ఒప్పుకోవటం విభేధాలకు దారి తీసింది.

2 అలాగే ఎంగేజ్మెంట్ పార్టికి...త్రిష...ధనుష్ ని పిలవటం ..వరుణ్ కు ఇష్టం లేదు. ఇద్దరి మధ్యా గతంలో విభేదాలు ఉన్నాయి. అయితే త్రిష వాటిని ప్రక్కన పెట్టి ధనుష్ ని పిలవటం అతనికి చిరాకు తెప్పించింది అంటున్నారు.

3 ఇక త్రిష ఏమని ఫీలైందంటే...వరుణ్ ..ఓ కంట్రోల్ ఫ్రీక్ లాగ బిహేవ్ చేస్తున్నాడని..అంటే తనను కంట్రోలు చేయటానికి ప్రయత్నిస్తున్నాడని ...

అయితే ఇవన్నీ మీడియా వారి అభూత కల్పనలే కావచ్చు..లేదా నిజమూ కావచ్చు.

మరో ప్రక్క వీరి వ్యవహారం రోజు రోజుకూ ముదురుతూ షాక్ ఇస్తోంది. తాజాగా వరుణ్ ట్వీట్ చేస్తూ..పేరు ప్రస్తావించకుండా స్లట్ అన్నాడు. కాస్సేపటికే త్రిష అతన్ని ట్విట్టర్ లో అన్ ఫాలో అయ్యింది. దాంతో అందరూ ..వరుణ్ అన్నది త్రిషే అనే ఉద్దేశానికి వచ్చేసారు. కాకపోతే కాస్సేపటికి...స్లట్ అని పెట్టిన ట్వీట్ ని డిలేట్ చేసేసాడు. అయితే అప్పటికే జరగవలిసిన డామేజ్ జరిగిపోయింది. ఈ ట్వీట్ అన్ని మీడియాల్లోకి పాకేసింది. ఈ ట్విట్టర్ డ్రామా ఎన్నాళ్లు సాగుతుందో మరి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Media finds reasons for Trisha’s breakup

గత కొద్ది రోజులుగా త్రిష- వరుణ్‌ మణియన్‌ల పెళ్లి విషయం హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య పెళ్లికి ముందే అభిప్రాయభేదాలు రావడంతో విడిపోయినట్లు సిని,మీడియా వర్గాలు కోడై కూస్తున్నాయి. ఈ నేపధ్యంలో వీరి సన్నిహితులు ముందుకు వచ్చి...వీరిని కలిపే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. చిన్న చిన్న అభిప్రాయ భేధాలు ఎవరి మధ్య అయినా సహజమేనని, సర్దుకుపోవాలని రాజీ చేయటానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

వరుణ్ మణియన్ ...రాజీకు ఇష్టపడినా, త్రిష మాత్రం పట్టుదలగా ఉందని అంటున్నారు. అయితే అసలు వీరిద్దరి మధ్యా ఏం జరిగింది.. అప్పుడే ఎందుకు విడిపోయాలి అనే ఆలోచనకు అప్పుడే ఎందుకు వచ్చారనేది మాత్రం అర్దం కావటంలేదని అంటున్నారు. కానీ సన్నిహితులు మాత్రం...వీరిద్దరూ కలిసి ట్విట్టర్ ద్వారా కానీ ,మీడియా ద్వారా కానీ స్పందిస్తే బాగుంటుందని సూచిస్తున్నారట.

త్రిష.. చిత్ర నిర్మాత వరుణ్‌ మణియన్‌తో ప్రేమాయణం సాగించి, నిశ్చితార్థం చెన్నైలో ఈ ఏడాది జనవరి 23న జరిగింది. ఆ తర్వాత సినీ ప్రముఖులు, స్నేహితులకు ఓ నక్షత్ర హోటల్‌లో విందు కూడా ఇచ్చారు. ప్రస్తుతంఅంతేకాకుండా కొన్ని ప్రముక తమిళ పత్రికలు కూడా వీరిద్దరూ విడిపోయారంటూ వార్తలు ప్రచురించాయి.

Media finds reasons for Trisha’s breakup

ఇటీవల వరుణ్‌మణియన్‌ చెల్లెలు వివాహానికి కూడా త్రిష హాజరు కాలేదని, అంతేకాకుండా త్రిష తన చేతిలో ఉన్న నిశ్చితార్థ ఉంగరాన్ని కూడా తీసేశారన్నది ఆ వార్తల సారాంశం. మరోవైపు వీరిద్దర్నీ కలిపేందుకు సన్నిహిత స్నేహితులు ప్రయత్నిస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

త్రిషకు వరుణ్‌మణియన్‌తో వివాహ నిశ్చితార్థానికి ముందు పెద్దగా చిత్రాలు లేవు. అంతకుముందు అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసి పెళ్లికి సిద్ధం అవ్వాలని ఆమె నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత త్రిష నటించిన ఎన్నై అరిందాల్ చిత్రం విడుదలైన హిట్ అవ్వడంతో పాటు ఆమెకు మంచి పేరు వచ్చింది. మేనేజర్ గిరిధర్ నిర్మిస్తున్నారు. త్రిష చిత్రాలు మీద చిత్రాలు అంగీకరించడంతో ఆమె పెళ్లి గురించి రకరకాల వదంతులు ప్రచారం అవుతున్నట్లు ఒక ఆంగ్ల పత్రిక కథనం రాసింది. అయితే ఈ వ్యవహారం గురించి ఇటు త్రిషగాని, అటు వరుణ్‌మణియన్‌గాని స్పందించక పోవడం గమనార్హం.

తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో హవా చాటుకుంటున్న త్రిష.. ఇప్పటికీ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. తెలుగులో బాలకృష్ణ సరసన ఆమె నటించిన 'లయన్‌' త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు తమిళంలోనూ కొత్తగా రెండు చిత్రాల్లో నటిస్తోంది.

English summary
Tamil media has found reasons as to why Trisha Krishnan has broke up from Varun Manian.
Please Wait while comments are loading...