అక్కినేని హీరోతో మీనాక్షి చౌదరి.. రెడ్ హ్యాండెడ్‌గా అలా దొరికిపోయిన జంట

ప్రస్తుతం ఇండియాలోని చాలామంది స్టార్స్ తమ సహ నటులతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. కొందరు తమ ప్రేమను ఇప్పటికే వ్యక్తపరచగా.. మరికొందరు మాత్రం సీక్రెట్‌గా ప్రేమాయణం సాగిస్తున్నారు. టాలీవుడ్ టూ బాలీవుడ్ ఇలా ఎవరిని చూసినా ఇలాంటి బాగోతాలు చాలానే ఉన్నాయి. తాజాగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రేసులో ఉన్న మీనాక్షి చౌదరి.. ఓ అక్కినేని హీరోతో ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా గత కొంతకాలంగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా వీరిద్దరి బంధంపై ఓ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

మల్టీ టాలెంటెడ్ మీనాక్షి చౌదరి
హర్యానాకు చెందిన మీనాక్షి చౌదరి మోడలింగ్ నుంచి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మీనాక్షి చదువులో టాపర్. స్వయంగా డాక్టర్ కావడం గమనార్హం. అంతేకాదు.. ఈ ముద్దుగుమ్మ మల్టీ టాలెంటెడ్. చదువుకునే రోజుల్లోనే స్టేట్ లెవల్ స్విమ్మింగ్, బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొని ఎన్నో అవార్డుల్ని సొంతం చేసుకున్నారు మీనాక్షి చౌదరి. 2021లో ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో తెలుగులో అడుగుపెట్టారు. అయితే తొలి సినిమాతో అంతగా గుర్తింపు దక్కలేదు.

Meenakshi Chaudhary and Sushanth Anumolu s Video sparks dating rumors

లక్కీభాస్కర్‌తో స్టార్‌డమ్
ఆ తర్వాత ఖిలాడీ, హిట్ 2, గుంటూరు కారం, మట్కా, మెకానిక్ రాకీ తదితర చిత్రాల్లో నటించింది. ఈ దశలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన లక్కీ భాస్కర్ సినిమాతో బాగా పాపులర్ అయ్యారు మీనాక్షి చౌదరి. ఆ వెంటనే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరో బ్లాక్‌బాస్టర్ తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోయిన్ రేసులో దూసుకొచ్చారు. తెలుగుతో పాటు తమిళంలో ది గోట్, సింగపూర్ సెలూన్, కోలై తదితర చిత్రాల్లో నటించారు మీనాక్షి చౌదరి. గ్లామర్ రోల్స్‌కైనా, నటిగా ప్రాధాన్యమున్న పాత్రలనైనా మెప్పించగలనని ఈ ముద్దుగుమ్మ నిరూపించుకుంది. లక్కీ భాస్కర్‌ మూవీలో తల్లిగా నటించి షాకిచ్చింది.

నాగచైతన్య సరసన హీరోయిన్‌గా
ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య సరసన NC 24 మూవీలో నటిస్తున్నారు. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తుండగా. అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు సంగీతం వహిస్తున్నారు. అక్కినేని నాగచైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్. ఈ మూవీకి వృషకర్మ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌ అయ్యే దిశగా గట్టి ఫోకస్ పెట్టిన మీనాక్షి చౌదరి తాజాగా ఓ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఆ హీరోతో మీనాక్షి డేటింగ్?
కింగ్ అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్‌తో మీనాక్షి డేటింగ్ చేస్తున్నట్లుగా గత కొంతకాలంగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. 2021లో ఇచ్చట వాహనములు నిలుపరాదు మూవీలో సుశాంత్, మీనాక్షి జంటగా నటించారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. త్వరలోనే మీనాక్షి - సుశాంత్‌‌లు ప్రేమ వివాహం చేసుకోబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే గతంలోనే ఈ పుకార్లపై మీనాక్షి స్పందించారు. సుశాంత్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమేనని, అంతకు మించి తమ మధ్య ఎలాంటి బంధం లేదని తేల్చేసింది మీనాక్షి.

Take a Poll

ప్రియుడితో ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షం
తాజాగా మీనాక్షి చౌదరి- సుశాంత్‌లు ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షం కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇందులో మీనాక్షి ముఖానికి మాస్క్ వేసుకుని హ్యాండ్ బ్యాగ్‌తో నడుచుకుంటూ వస్తుండగా.. సుశాంత్ లగేజ్ ట్రాలీతో పాటు మరో బ్యాగ్‌ని పట్టుకుని, ఆమెతో క్లోజ్‌గా మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిపై సుశాంత్, మీనాక్షిలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X