»   » పాపం.. డిఫెన్స్‌లో సాయి, వరుణ్.. ఇక నెక్ట్స్ ఏంటీ.. బన్నీ, చెర్రీ పరిస్థితి..!

పాపం.. డిఫెన్స్‌లో సాయి, వరుణ్.. ఇక నెక్ట్స్ ఏంటీ.. బన్నీ, చెర్రీ పరిస్థితి..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా క్యాంపులో యువ హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్‌లు తమ తొలి చిత్రాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. బాక్సాఫీసు వద్ద విన్నర్, మిస్టర్ చిత్రాలు ఆశించినంత కలెక్షన్లు రాబట్టకపోవడంతో మెగా హీరోల సినిమాలు దారుణమైన ఫ్లాప్‌ను మూటగట్టుకొన్నాయి. ఊహించని ఫలితాలు రావడంతో ప్రస్తుతం సాయి, వరుణ్‌లు డిఫెన్స్‌లో పడినట్టు తెలుస్తున్నది. సినిమాల ఎంపికపై ఆచితూచి అడుగేయాలని నిర్ణయించుకొన్నసమాచారం.

ఇక వాటిపైనే ఆశలు..

ఇక వాటిపైనే ఆశలు..

సాయి ధరమ్ తేజ్‌కు పిల్లా నీవు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలు మంచి గుర్తింపుతోపాటు కలెక్షన్లనూ రాబట్టాయి. ఆ తర్వాత నటించిన తిక్క, విన్నర్ సినిమాలు బాక్పాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.
ప్రస్తుతం కృష్టంవంశీ తీస్తున్న నక్షత్రంలోనూ, జవాన్ అనే మరో చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఈ చిత్రాలు జూలై, ఆగస్టులో విడుదల కానున్నాయి. ఇక ఈ రెండు చిత్రాలపైన సాయి బోలెడంత ఆశలు పెట్టుకొన్నట్టు తెలుస్తున్నది.

ఎంపికపై మరోసారి

ఎంపికపై మరోసారి

మిస్టర్ సినిమా తర్వాత వరుణ్ తేజ్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మించే సినిమాలో నటిస్తున్నాడు. గతంలో కంచె, ముకుంద లాంటి చిత్రాలు నటుడిగా మంచి పేరును సంపాదించిపెట్టాయి. ఆ తర్వాత నటించిన లోఫర్, మిస్టర్ సినిమాలను ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. కమర్షియల్ హీరో అనే ముద్ర వేసుకోవాలని చేసిన మిస్టర్‌పై సానుకూలత రాకపోవడంతో తన చిత్రాల ఎంపికపై పునరాలోచనలో పడినట్టు తెలుస్తున్నది.

ఫ్లాప్లతో డిఫెన్స్‌లో

ఫ్లాప్లతో డిఫెన్స్‌లో

కమర్షియల్ డైరెక్టర్ల సినిమాల్లో నటించడం తప్పుకాదని, అయితే స్క్రిప్ట్ విషయంలో పక్కాగా ఉండాలని ఈ ఇద్దరు మెగా హీరోలు నిర్ణయానికి వచ్చారట. విన్నర్, తిక్క, లోఫర్, మిస్టర్ చిత్రాలు మంచి డైరెక్టర్లే రూపొందించినప్పటికీ.. పేలవమైన కథ వీరికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ క్రమంలో కథపై సీరియస్‌గా దృష్టిపెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.

జోరుగా బన్ని, చెర్రీ..

జోరుగా బన్ని, చెర్రీ..

మెగా క్యాంపులో ఒకవైపు అల్లు అర్జున్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. సరైనోడు చిత్రంతో సంచలన విజయాన్ని అందుకొన్నాడు. దువ్వాడ జగన్నాథంతో మరో హిట్‌కు సిద్ధమవుతున్నాడు. అలాగే కథా రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా మార్చి ‘నా పేరు శివ.. నా ఇల్లు ఇండియా' అనే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక రాంచరణ్‌కు బ్రూస్‌లీ కొంత నిరాశే మిగిల్చినప్పటికీ.. నిర్మాతగా ఖైదీ నంబర్ 150తో మంచి సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం సుకుమార్ రూపొందించే సినిమాలో ఓ విభిన్నమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.

English summary
Recent times Mega Heros Sai Dharam Tej and Varun Tej are disappointed with their moviews. Tikka, Winner are not upto the mark for Sai, Lofer, Mister are not well at box office for Varun. Now they are seriously percieving the story angel for great success now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu