»   » నిజమా :డైరక్టర్ సెట్ లో లేకుండానే ఖైదీ నంబ‌ర్ 150 షూటింగ్?

నిజమా :డైరక్టర్ సెట్ లో లేకుండానే ఖైదీ నంబ‌ర్ 150 షూటింగ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ హీరో,హీరోయిన్స్ గా ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఖైదీ నంబ‌ర్ 150 (బాస్ ఈజ్ బ్యాక్‌) తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే యూర‌ప్ షెడ్యూల్ పూర్తి చేసుకుని చిత్ర‌యూనిట్ హైద‌రాబాద్‌లో అడుగుపెట్టింది. ఈ చిత్రం రిలిజ్ కు కేవలం నెల మాత్రమే సమయం ఉంది. ఈ నేపధ్యంలో షూటింగ్ స్పీడు పెంచారు.

అందుతున్న సమాచారం ప్రకారం...రెండు సెపరేట్ యూనిట్స్ విడివిడిగా ఈ చిత్రం షూటింగ్ లో పాలు పంచుకుంటున్నాయి. ఒక యూనిట్ ని వివి వినాయిక్ లీడ్ చేస్తూండగా మరో యూనిట్ ని ఆయన కోడైరక్టర్...ఆయన సూచనలతో లీడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Mega Star's Khaidi 150 Shoot without Vinayak?

చిరంజీవిపై వచ్చే కాంబినేషన్ సీన్స్ అన్నీ చిరంజీవి దగ్గరుండి షూట్ చేస్తూండగా, మిగతా ఆర్టిస్ట్ లకు సంభందించిన సీన్స్ ..రెండో యూనిట్ షూట్ చేస్తూ శరవేగంగా షూటింగ్ ఫినిష్ చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఒక యూనిట్ రామోజి ఫిల్మ్ సిటిలో షూట్ చేస్తూండగా, రెండో యూనిట్...నాగార్జున సాగర్ లో షూటింగ్ చేస్తోందని సమాచారం.

నిర్మాత‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ-"మెగాస్టార్ కెరీర్‌లోనే వెరీ స్పెష‌ల్ మూవీ ఇది. ఓ చ‌క్క‌ని క‌థాంశంతో, విజువ‌ల్ గ్రాండియారిటీతో ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ గారు అద్భుతంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. యూత్‌ స‌హా కుటుంబ స‌మేతంగా అంతా క‌లిసి చూడ‌ద‌గ్గ చిత్రంగా మ‌లిచారు. నిన్న‌టితో టాకీ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. నేటినుంచి రామోజీ ఫిలింసిటీలో శంక‌ర్ మాష్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో చివ‌రి పాటను తెర‌కెక్కిస్తున్నారు. ఈ పాట‌తో మొత్తం షూటింగ్ పూర్త‌యిన‌ట్టే. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో సినిమా రిలీజ్ చేస్తున్నాం" అని తెలిపారు.

English summary
Chiranjeevi's Khaidi No. 150 ..While one unit would be working in Ramoji Film City, the other unit would can scenes at Nagarjuna Sagar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu