Just In
- 34 min ago
KGF Chapter 2 నుంచి షాకింగ్ అప్‌డేట్: ఆ ఒక్క దాని కోసమే రూ. 12 కోట్లు ఖర్చు
- 46 min ago
రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రామ్ సినిమా: కొత్త మూవీ విడుదలకు డేట్ ఫిక్స్
- 1 hr ago
Box office: పది రోజులైనా తగ్గని క్రాక్ హవా.. మొత్తానికి మాస్టర్ పనైపోయింది
- 1 hr ago
సిగరెట్ తాగుతూ బోల్డ్ మాటలు.. షాక్ ఇచ్చిన రేసుగుర్రం మదర్ పవిత్ర.. రెడ్ రెమ్యునరేషన్ ఎంత?
Don't Miss!
- Finance
అమెరికా ప్యాకేజీ ఎఫెక్ట్, సెన్సెక్స్ భారీగా జంప్: రిలయన్స్, ఐటీ స్టాక్స్ అదుర్స్
- Automobiles
భారత సర్కార్ సాయం చేసి ఉంటే రూ.5,000 లకే ఈ కార్ లభించేంది..
- News
అమరావతి ఉద్యమం 400 వ రోజు : గొల్లపూడిలో హై టెన్షన్ ; ఇంట్లోనే దీక్షకు దిగిన దేవినేని ఉమ
- Lifestyle
శృంగారాన్ని ప్రతిరోజూ ఆస్వాదించాలంటే... ఈ చిట్కాలను పాటించండి...
- Sports
అతని గురించి ఎంత చెప్పినా తక్కువే.. శరీరానికి ఎన్ని దెబ్బలు తగిలినా మ్యాచ్ కాపాడాడు: గవాస్కర్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Chiru 152: బయటపడ్డ సీక్రెట్.. రామ్ చరణ్ రోల్ ఇదే! ఇక మెగా అభిమానులకు పండగే..
సినిమాల్లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి సక్సెస్‌ఫుల్ జర్నీ కొనసాగిస్తున్నారు. ''ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహా రెడ్డి'' సినిమాలతో సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకున్న ఆయన.. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో మరో ప్రతిష్టాత్మక సినిమా చేస్తున్నారు. చిరంజీవి 152వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ అప్‌డేట్ మెగా అభిమానులకు కిక్కిస్తోంది. ఇంతకీ అసలు ఏంటి విషయం? వివరాల్లోకి పోతే..

చిరంజీవి కోసం ప్రత్యేకంగా కొరటాల శివ
సామాజిక అంశాలను ఎలివేట్ చేస్తూ సినిమాలు రూపొందించడంలో దిట్ట కొరటాల శివ. అదేబాటలో చిరంజీవి 152 కోసం ప్రత్యేకంగా బలమైన కథను రాసుకున్నారట ఈ డైరెక్టర్. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశారట కొరటాల. నేటి సమాజంలో దేవాలయాల ప్రాముఖ్యత తెలియజేస్తూ, ఆ దేవాలయాల్లో జరిగే అక్రమాలను కళ్ళకు కట్టినట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారట.

తండ్రితో తనయుడు.. సీక్రెట్ అనుకున్నారు కానీ
అంతేకాదు ఈ సినిమా నిర్మాణంలో భాగమవుతున్న మెగా వారసుడు రామ్ చరణ్‌కి కూడా స్క్రీన్ స్పేస్ ఇచ్చారట. ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచి మెగా అభిమానులను సర్‌ప్రైజ్ చేద్దామని అనుకున్నారట కొరటాల. కానీ ఊహించని విధంగా ఇందులో రామ్ చరణ్ రోల్ విషయమై వార్తలు పుట్టుకొస్తున్నాయి.

యంగ్ చిరంజీవి.. కీలకంగా చెర్రీ
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల సారాంశం మేరకు చిరంజీవి 152లో రామ్ చరణ్ రోల్ కీలకంగా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో యంగ్ చిరంజీవి రోల్ పోషిస్తున్నారట చెర్రీ. కాకపోతే తండ్రి చిరంజీవితో రామ్ చరణ్ కాంబినేషన్ సీన్స్ మాత్రం కనిపించవని తెలుస్తోంది. ఏదేమైనా యంగ్ చిరంజీవిగా రామ్ చరణ్ అనే న్యూస్ మెగా అభిమానుల్లో ఆతృతను పెంచేస్తోంది.

చిరంజీవితో త్రిష రొమాన్స్
మరోవైపు చాలాకాలంగా ఈ సినిమా రెగ్యులర్ షూట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీంతో ఇటీవలే అభిమానుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తూ తన 152వ సినిమాతో సెట్స్ పైకి వచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష నటించనుందని సమాచారం.

కొరటాల టార్గెట్.. ఇక ఆగేదే లేదు
కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కించనున్న చిరు 152 చిత్రానికి ‘గోవిందా హరి గోవిందా' అనే టైటిల్ పరిశీలనలో ఉంచారు. ఇక ఆగేదే లేదన్నట్లుగా శరవేగంగా షూటింగ్ చేస్తూ ఆగస్ట్ 14న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుంచేలా టార్గెట్ పెట్టుకున్నారు కొరటాల శివ.