Don't Miss!
- Lifestyle
మీ పార్ట్నర్ ఎప్పుడూ మూడీగా ఉంటారా? వారితో వేగలేకపోతున్నారా? ఈ చిట్కాలు మీకోసమే
- News
YS Avinash Reddy : అవినాష్ కు సీబీఐ ప్రశ్నలివే-2గంటలకు పైగా విచారణ-లాయర్ కూ నో ఎంట్రీ..!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Sports
INDvsNZ : ఉమ్రాన్ మాలిక్‌ను తీసేయండి.. రెండో టీ20కి మాజీ లెజెండ్ సలహా!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
Waltair veerayya సక్సెస్ సందర్భంగా డైరెక్టర్ కు ఖరీదైన కానుక.. జాక్ పాట్ కొట్టేశాడుగా?
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంక్రాంతి ఫెస్టివల్లో ఊహించిన విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకువచ్చింది. ప్రస్తుతం అయితే రెండు కోట్లకు పైగా ప్రాఫిట్ జాన్ లో కొనసాగుతోంది. కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు వచ్చే కలెక్షన్స్ అందుతున్నాయి.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి అమెరికాలో రెండు మిలియన్స్ కు పైగా డాలర్స్ అందుకొని సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ సినిమాకు మరింత కలెక్షన్స్ వస్తాయని అనిపిస్తోంది. ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ ఒక ముఖ్యమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక చిరంజీవి నటించిన విధానం కూడా సినిమాకు బాగానే హెల్ప్ అయ్యింది. మళ్ళీ వింటేజ్ మెగాస్టార్ ను చూసినట్లు ఉందని ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.

అయితే ఇంతటి విజయానికి కారణమైన దర్శకుడు బాబికి కూడా మెగాస్టార్ చిరంజీవి ఒక ఖరీదైన కానుక ఇచ్చినట్లుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక టాక్ వైరల్ గా మారిపోతుంది. కోటికి పైగా విలువ చేసే ఖరీదైన కారును మెగాస్టార్ చిరంజీవి ఈ దర్శకుడికి కానుకగా ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఎవరు కూడా ఈ విషయంలో ఇంతవరకు కొద్దిగా క్లారిటీ ఇచ్చింది లేదు.
సాధారణంగా ఏ దర్శకుడైన సరే ఇటీవల కాలంలో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంటే అతనికి ఖరీదైన కానుక ఇవ్వడం సర్వసాధారణం. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి సంపూర్ణమైన సక్సెస్ ఇవ్వడంతో దర్శకుడు జాక్ పాట్ కొట్టేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని కూడా ఇంతవరకు ఎవరు అధికారికంగా తెలియజేయలేదు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక మరోవైపు బాబి తన తదుపరి సినిమాను మరో స్టార్ హీరోతోనే మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఆ విషయంపై కూడా అధికారికంగా క్లారిటీ రానుంది.