స్పిరిట్ లో మెగాస్టార్.. చిరుతో సందీప్ రెడ్డి వంగ చర్చలు.. ఏమన్నారంటే?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. యంగ్ డైరెక్టర్స్ తో కలిసి చిరు భారీ చిత్రాల్లో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాలు ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో చిరంజీవి తన చిత్రాలతో పాటు మరోవైపు క్యామియో పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. అది కూడా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సినిమాలోనే గెస్ట్ గా మెరిసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ చిత్రం ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇక డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇప్పటికే అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలకు దర్శకత్వం వహించి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో నెక్ట్స్ సందీప్ రెడ్డి వంగ చిత్రంపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి భారీ చిత్రాన్ని చిత్రీకరించబోతున్నారు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబినేషన్ లోని సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ ను కన్ఫమ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎప్పుడెప్పుడు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా స్పిరిట్ చిత్రం గురించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఆసక్తికంగా మారింది.

Megastar Chiranjeevi In Sandeep Reddy Vanga Spirit Movie

ఇప్పటికే స్పిరిట్ చిత్రంలో హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగ త్రిప్తి డిమ్రీని ఎంపిక చేశారు. ఈ చిత్రంలో విలన్ గా కొరియన్ స్టార్ డాన్లీని కూడా తీసుకు రాబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై సందీప్ రెడ్డి వంగా పరోక్షంగా కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక హీరో తరుణ్, మండోనా సెబాస్టియన్, నటుడు శ్రీకాంత్ కూడా కీలక పాత్రల్లో నటించబోతున్నారని తెలుస్తోంది. దీనిపై ఇంకా స్పష్టమైన ప్రకటన కూడా రావాల్సి ఉంది. ఇక ఇప్పుడు చిరంజీవిని క్యామియో రోల్ లో నటింపజేయాలని సందీప్ రెడ్డి వంగ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో వచ్చిన యానిమల్ చిత్రంలో అనిల్ కపూర్ క్యామియో అప్పియరెన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉండిందో అందరికీ తెలిసిందే.

దీంతో చిరంజీవి స్పిరిట్ చిత్రంలో క్యామియో అప్పియరెన్స్ ఇస్తే ఇక సెన్సేషనల్ గా నిలుస్తుందని సినీ ప్రముఖులు అంటున్నారు. కాగా ఇప్పటికే చిరంజీవి 4 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడితో మన శంకరవరప్రసాద్ గారు, మల్దిడి వశిష్టతో విశ్వంభర, బాబీతో మెగా158, శ్రీకాంత్ ఓదెలతో మెగా 159 చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. ఈ చిత్రాల షూటింగ్స్ తో బాస్ బిజీగా ఉండటంతో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ చిత్రానికి సమయం ఇస్తారా? లేదా? అనేది చూడాలంటున్నారు.

మరోవైపు సందీప్ రెడ్డి వంగ చిరంజీవి గారెకి వీరాభిమాని. ఆయన ఇంట్లో మెగాస్టార్ చిరంజీవి పోస్టర్స్ ఉండటం ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం. దీంతో చిరంజీవిని తన డైరెక్షన్ లో చూపించే ఆసక్తిని తప్పకుండా కలిగి ఉంటారని, ఈ క్రమంలో స్పిరిట్ లో క్యామియోకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రం ఇండియాతో పాటు మెక్సీకో లో ఎక్కువ షూట్ జరుగుతుందని, సెప్టెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, కొరియన్ భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదల చేయబోతున్నామని ప్రకటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X