twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ’మా’ పదవికి చిరంజీవి రాజీనామా? మరింత ముదిరిన వివాదాలు...

    |

    మా సినీ పరిశ్రమకు సంబంధించిన వివాదాలు గతంలో ఏ స్థాయిలో వైరల్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గొడవల డోస్ తగ్గుతున్నాయని అనుకున్న సమయానికి ఎదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అయిన 'మా'కు దురమైనట్లు తెలుస్తోంది. అందులో క్రమశిక్షణ కమిటీ నుంచి పూర్తిగా తప్పుకున్నట్లు తెలుస్తోంది.

    'మా'కు ప్రాణం పోసిన వారిలో మెగాస్టార్

    'మా'కు ప్రాణం పోసిన వారిలో మెగాస్టార్

    సినిమా పరిశ్రమలో ఆర్థికంగా వెనుకబడిన ఆర్టిస్టులకు అండదండగా ఉండేందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ప్రాణం పోసిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. మురళీమోహన్ వంటి సీనియర్ నటులతో కలిసి మా సంస్థను మరో స్థాయికి తీసుకువెళ్లారు. ఏ ఆర్టిస్ట్ కూడా ఆకలితో ఉండకూడదని అందుకే సంస్థను ఏర్పాటు చేసినట్లు మురళీమోహన్ పలు ఇంటర్వ్యూలలో చెప్పారు.

    కరోనా టైమ్ లో కూడా..

    కరోనా టైమ్ లో కూడా..

    మెగాస్టార్ కూడా కష్టం వచ్చినా ప్రతిసారి తనవంతు సహాయాన్ని అందిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా మా సంస్థకు ఫండ్స్ కలెక్ట్ చేయడానికి ఆయన అనేక రకాల ఈవెంట్స్ కు సొంతంగా వెళుతూ మద్దతు ఇస్తున్నారు. కరోనా సమయంలో కూడా ఆయన ఎన్నో సినీ కుటుంబాలకు సహాయాన్ని చేశారు.

    క్రమశిక్షణ కమిటీ..

    క్రమశిక్షణ కమిటీ..

    అయితే మా సంస్థకు అధ్యక్షులుగా ఉన్నటువంటి నరేష్ - వైజ్ ప్రసిడెంట్ రాజశేఖర్ ల మద్య వివధాలు రావడం అప్పట్లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. అయితే ఎవరి మధ్య కూడా వివధాలు తెలెత్తకుండా ఒక క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేయగా అందులో కీలక సభ్యులుగా చిరంజీవి, కృష్ణంరాజు, మోహన్ బాబు, మురళీమోహన్, జయసుధ వంటి వారు సభ్యులుగా ఉన్నారు.

    మెగాస్టార్ అసంతృప్తి

    మెగాస్టార్ అసంతృప్తి

    ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా క్రమశిక్షణ కమిటీ వద్దకు తీసుకురావాలని అనవసరంగా బయటకు చెప్పి మా సంస్థ వాల్యుని తగ్గించవద్దని సినీ పెద్దలు చాలా సార్లు వివరణ ఇచ్చారు. ఇదే విషయాన్ని కొన్నిసార్లు మెగాస్టార్ గుర్తు చేయగా రాజశేఖర్ అభ్యంతరం చెప్పిన విషయం తెలిసిందే. అప్పుడే మెగాస్టార్ అసంతృప్తి చెందారు.

    పూర్తిగా తప్పుకున్న మెగాస్టార్?

    పూర్తిగా తప్పుకున్న మెగాస్టార్?

    నరేష్ - రాజశేఖర్ ల మధ్య చీలిక రావడంతో మా సంస్థలో ఎలాంటి కార్యక్రమాలు రూపు దాల్చుకోవడం లేదు. ఇప్పటికే డైరీ లాంచ్ ఈవెంట్ ను చేయాల్సి ఉండగా ఎవరు పట్టించుకోకపోవడం గమనార్హం. అయితే 'మా'లో గ్రూపు రాజకీయాలు మరింత ఎక్కువవుతున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి కూడా క్రమశిక్షణ కమిటీ నుంచి తప్పుకున్నట్లు టాక్ వస్తోంది. బలమైన కారణం లేనిదే మెగాస్టార్ ఆ విధమైన నిర్ణయం తీసుకోరు. మరి ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మా నెక్స్ట్ మీటింగ్ వరకు ఆగాల్సిందే.

    English summary
    Needless to say, the controversy surrounding MAA film industry has gone viral in the past. Something was amiss at the time when the dose of riots was thought to be declining. And now in the industry, it seems that megastar Chiranjeevi is upset with 'Ma', the Movie Artist Association. It seems that he has completely left the disciplinary committee.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X