For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Liger Movie Story: లైగర్‌ మూవీలో అసలు ట్విస్ట్ లీక్.. ఓహో క్రాస్ బ్రీడ్ అన్నది అందుకేనా!

  |

  చిన్న చిన్న పాత్రలతో కెరీర్‌ను ఆరంభించి.. 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా మారి.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపుతో పాటు పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. కెరీర్ ఆరంభంలోనే 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి సూపర్ హిట్లతో స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే తన స్టామినాను ఇండియా మొత్తం పరిచయం చేయాలన్న లక్ష్యంతో ఇప్పుడు 'లైగర్' అనే సినిమాను చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అసలేం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

   లైగర్‌గా మారిన విజయ్ దేవరకొండ

  లైగర్‌గా మారిన విజయ్ దేవరకొండ

  క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి ‘లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాను ఛార్మీ, పూరీతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో ఐదు భాషల్లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

  Bigg Boss Non Stop: అక్కడ ముద్దు పెట్టేవాడు.. అదయ్యాక హ్యాండ్ ఇచ్చాడు.. అషు రెడ్డి లవ్‌లో ట్విస్ట్!

  పాన్ ఇండియానే... హాలీవుడ్ రేంజ్

  పాన్ ఇండియానే... హాలీవుడ్ రేంజ్


  బాక్సింగ్ నేపథ్యంతో రూపొందుతోన్న ‘లైగర్'లో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎంతో మంది ప్రముఖులు పని చేస్తున్నారు. అలాగే, హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు ఇందులో భాగం అయ్యారు. అలాగే, అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. దీంతో దీని రేంజ్ పాన్ ఇండియా నుంచి హాలీవుడ్‌కు ఎదిగిపోయింది.

   అప్పుడే రిలీజ్.. ఇప్పుడా పనులతో

  అప్పుడే రిలీజ్.. ఇప్పుడా పనులతో

  విజయ్ దేవరకొండ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘లైగర్' సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నటీనటుల డేట్స్ ప్రకారం డబ్బింగ్ పనులను కూడా ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది.

  ఈషా రెబ్బా అందాల ఆరబోత: తొలిసారి ఇంత హాట్‌గా తెలుగమ్మాయి ఫోజులు

  Recommended Video

  Liger - Boxing Legend Mike Tyson In Vijay Deverakonda's Liger | Filmibeat Telugu
  ఆ వీడియో... రికార్డుతో అంచనాలు

  ఆ వీడియో... రికార్డుతో అంచనాలు

  తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ‘లైగర్' మూవీ నుంచి అప్‌డేట్లు ఆరంభం నుంచే పెద్దగా రావడం లేదు. దీంతో క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులు తీవ్ర నిరాశగా ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేశారు. దీనికి రికార్డు స్థాయిలో స్పందన దక్కిన విషయం తెలిసిందే.

  ఫేమస్ బాక్సర్ స్పెషల్ అట్రాక్షన్‌

  ఫేమస్ బాక్సర్ స్పెషల్ అట్రాక్షన్‌

  క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘లైగర్' మూవీలో అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌తో పాటు డబ్బింగ్‌ను కూడా పూర్తి చేసుకున్నాడు. అదే సమయంలో ఈ చిత్రం గురించి అప్పుడే ప్రచారం కూడా మొదలెట్టేశాడు. మొత్తానికి ఇందులో ఆయన స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నాడు.

  మరోసారి పాయల్ రాజ్‌పుత్ అందాల ఆరబోత: క్లాత్ మాత్రమే చుట్టుకుని యమ ఘాటుగా!

  లైగర్‌ మూవీలో అసలు ట్విస్ట్ లీక్

  లైగర్‌ మూవీలో అసలు ట్విస్ట్ లీక్


  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘లైగర్' మూవీ నుంచి తరచూ ఏదో ఒక షాకింగ్ న్యూస్ బయటకు వస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో ఊహాగానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ఓ సెన్సేషనల్ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఈ మూవీలో అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్.. విజయ్ దేవరకొండకు తండ్రిగా నటిస్తున్నాడట.

  క్రాస్ బ్రీడ్ అన్నది అందుకేనట!

  క్రాస్ బ్రీడ్ అన్నది అందుకేనట!


  స్వతహాగా బాక్సర్ అయిన మైక్ టైసన్ ఓ పని మీద ఇండియాకు వస్తాడట. అప్పుడు రమ్యకృష్ణతో ప్రేమలో పడతాడని తెలిసింది. వీళ్లకు హీరో జన్మిస్తాడట. తండ్రి విదేశీయుడు.. తల్లి స్వదేశీ కావడం వల్లే ఈ సినిమాకు ‘క్రాస్ బ్రీడ్' అనే ట్యాగ్ లైన్ పెట్టారని తెలుస్తోంది. ఇక, తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని హీరో వరల్డ్ చాంపియన్ అవడమే ఈ సినిమా స్టోరీ లైన్ అని టాక్.

  English summary
  Vijay Devarakonda Now Doing Liger Movie Under Puri Jagannadh Direction. Mike Tyson Plays Vijay devarakonda Father Role in This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X