twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్లాక్ మనీ: 3 కోట్లుకు పైనే , బెంగపెట్టుకున్న తెలుగు హీరోయిన్?

    By Srikanya
    |

    హైదరాబాద్: ఎప్పుడైతే ప్రధాని మోదీ 500 నోట్లు, 1000 నోట్లు కాన్సిల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారో అప్పుడు రకరకాల రూమర్స్ లాంటి వార్తలు సినీ పరిశ్రమనుంచి మొదలయ్యాయి. నిన్నంతా ఓ హీరో దగ్గర బ్లాక్ మనీ బోల్డు మూలుగుతోంది, ఏం చేయాలో అర్దం కాక, నిరాశలో మునిగిపోయాడంటూ వార్తలు వచ్చి, ఎవరా హీరో అని ఎంక్వైరీ మొదలెట్టిన నేపధ్యంలో ఇప్పుడు మరో వార్త బయిటకు వచ్చింది.

    అది రీసెంట్ గా సినిమాలు తగ్గించుకున్న హీరోయిన్ ఒకరి దగ్గర మూడు కోట్లకు పైగానే బ్లాక్ ఉందిట. ఆమె ఫామ్ లో ఉన్నప్పుడు సంపాదించిన సొమ్ము అది. పెళ్లి చేసుకుని సెటిల్ అవుదాము...దాంతో ఓ ప్రాపర్టీ కొందాము అని నిర్ణయించుకున్న ఆమెకు మోదీ దెబ్బతో పూర్తి నిరాశ ఎదురైందని చెప్తున్నారు. దాంతో ఆమె కష్టపడి సంపాదించుకున్న సొమ్ము..మూడు కోట్లు అని వాపోతోందిట. అయితే మూడు కోట్లుని వైట్ చేసుకునేందుకు తమ సర్కిల్స్ లో ప్రయత్నిస్తోందని చెప్పుకుంటున్నారు. ఆమె పేరు మాత్రం బయిటకు రాలేదు.

    వాస్తవానికి మన తెలుగులో కాదు దేశంలోని అన్ని లాంగ్వేజ్ ల్లోనూ చాలా మంది హీరోలు, హీరోయిన్స్ బ్లాక్ ఇంత, వైట్ ఇంత అని రెమ్యునేషన్ ని తీసుకుంటూంటారు. నిర్మాతలకు అదే వెసులు బాటుకావటంతో బ్లాక్ మనీ విచ్చలవిడిగా పరిశ్రమలో తిరిగుతూంటుంది. ఆ డబ్బు అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ రియల్ ఎస్టేట్ రంగంలోకి అందులోంచి మళ్లీ సినీ పరిశ్రమలోకి వస్తుంది.

    దాంతో చాలా మంది హీరోలు, హీరోయిన్స్ వద్ద బ్లాక్ మనీ అనేది కామన్. కాకపోతే హీరోల వద్ద బ్లాక్ ఉండటానికి అవకాసం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హీరోలకి రెమ్యునేషన్ ఎక్కువ కాబట్టి. దానికి తోడు రెమ్యునేషన్స్ విపరీతంగా పెరగటంతో బ్లాక్ అనేది , టాక్స్ కట్టకుండా తప్పించుకోవటానికి ఓ మార్గం అయ్యింది. ఈ నేపధ్యంలో ప్రధాని తీసుకున్న ఈ నోట్ల కట్ల రద్దు వ్యవహారం ఇలాంటి వారందిరికీ సమస్య తెచ్చి పెట్టింది.

    ప్రధాని మోదీ నోట్ల కట్ల రద్దు వ్యవహారం తెలుగులోని ఓ స్టార్ హీరో కు పెద్ద తలనొప్పే తెచ్చిపెట్టినట్లైంది. పాతిక కోట్లకు పైగా క్యాష్ ఆయన ద్గగర బ్లాక్ మనీ ..ఇప్పుడు ఏం చేయాలో అని తలపట్టుకున్నారట. నిన్నటి నుంచి షూటింగ్ కు కూడా హాజరు కాకుండా ఆయన తన వాళ్లతో మంతనాలు జరుపుతున్నారట. ఆ వివరాలు క్రింద ఇస్తున్నాం..చదవండి..

    1000 నోట్లు

    1000 నోట్లు

    ఇక ప్రస్తుత విషయానికి వస్తే...ఆ స్టార్ హీరో దగ్గర ఓ రియల్ ఎస్టేట్ డీల్ కోసం దాచిన పాతిక కోట్లు ..దాదాపు అన్ని వెయ్యి రూపాయల నోట్లు డినామినేషన్ తో ఉన్నాయిట ఇంట్లో. ఓ రెండు రోజుల్లో షంషాబాద్ వద్ద ఓ సెటిల్మెంట్ కోసం తెచ్చిన డబ్బు...ఇప్పుడు ఏం చేయాలా అనే సమస్యలో పడేసిందిట.

    మొత్తం బ్లాక్ మనీ

    మొత్తం బ్లాక్ మనీ

    లెక్క చెప్దాము అంటే...దానికి లెక్కలు లేవు. అది బ్లాక్ మనీట. ఈ విషయం ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం అవుతోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే..ఆయన బయిట వారితో మీడియావారితో మాత్రం మోదీ తెచ్చిన ఈ మార్పు అద్బుతమని పొగుడుతూమాట్లాడుతున్నారట. లోపల ఏడుస్తూ..బయిటకు నవ్వుతూ ఇలా ఆ స్టార్ హీరో నిన్నటినుంచీ నటిస్తున్నాడట.

    రోజు చేతులు మారుతుంది

    రోజు చేతులు మారుతుంది

    రియల్‌ఎస్టేట్‌ రంగం నుంచి, ఇతర వ్యాపారాల నుంచి సినిమా రంగంలోకి పెట్టుబడులు వస్తుండడంతో నల్లధనం ఫిల్మ్‌నగర్‌లోనూ చేతులు మారుతుంటుందని చెబుతుంటారు. రెమ్యునేషన్స్ , రోజువారీ వేతనాలు, సినిమా అమ్మకం, కొనుగోలు... వీటిలో ఎక్కువ శాతం లావాదేవీలు నేరుగా డబ్బు రూపేణా జరుగుతాయని చెప్పుకొంటుంటారు కూడా. మోదీ నిర్ణయం వాళ్లందరినీ అవాక్కయ్యేలా చేసింది.

    నిర్మాత ఆఫీస్ లో బస్తాలతో డబ్బు

    నిర్మాత ఆఫీస్ లో బస్తాలతో డబ్బు

    బయ్యర్లు, పంపిణీదారులు సినిమా విడుదలకు ముందు ఆఖరి నిమిషాల్లో డబ్బులు సర్దుబాటు చేస్తుంటారు. అలాంటి సమయాల్లో డబ్బు బస్తాల రూపంలో నిర్మాత ఆఫీసులో బోర్లిస్తారని కథలు కథలుగా చెప్పుకొంటుంటారు. ఇప్పుడు అలాంటి నగదు లావాదేవీలన్నీ ఆగిపోవడం ఖాయం.

    పద్దతి మార్చుకుంటారా

    పద్దతి మార్చుకుంటారా

    మరోవైపు భారీగా రెమ్యుషన్ అందుకొనే హీరో, హీరోయిన్, దర్శకులు... కొంతమొత్తాన్ని బ్లాక్‌లో ఇవ్వాలని డిమాండ్‌ చేస్తుంటారట. ఇప్పుడు వాళ్ల మాటేంటి? ఇక ఆ పద్ధతి మార్చుకోవాల్సిందే అంటూ పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

    వైట్ లోనూ అడుగుతున్నారు

    వైట్ లోనూ అడుగుతున్నారు

    వీటిపై తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు బూరుగుపల్లి శివరామకృష్ణ మాట్లాడుతూ ‘‘మోదీ నిర్ణయాన్ని అంతా స్వాగతిస్తున్నారు. ఆ ప్రభావం చిత్రసీమపై పెద్దగా ఉండదనే భావిస్తున్నాం. ఎందుకంటే మన హీరోలు, దర్శకులు చాలా మారారు. పారితోషికాన్ని ‘వైట్‌'లోనే ఎక్కువగా తీసుకొంటున్నారు.

    పెద్ద సినిమాలకు సమస్య ఉండదు

    పెద్ద సినిమాలకు సమస్య ఉండదు

    పెద్ద సినిమాల వ్యాపారం పక్కాగా ముందే జరిగిపోతుంటుంది. వాళ్ల లావాదేవీలన్నీ ఇప్పుడు చెక్కుల్లోకి మార్చుకోవాల్సిందే. ఈమధ్య చిత్రసీమ బడ్జెట్లు బాగా పెరిగాయి. దాంతో రిస్క్‌ బాగా పెరిగింది. అలాంటప్పుడు నష్టపరిహారాన్ని క్లెయిమ్‌ చేసుకోవాలంటే తగిన ఆధారాలు ఉండాల్సిందే. అందుకే బయ్యర్లు, నిర్మాతలు కూడా అంతా పక్కా లెక్కల్ని తమ దగ్గర అట్టిపెట్టుకొంటున్నారు. ఇప్పుడు ఆ పద్ధతి మరింత పెరుగుతుంది'' అన్నారు శివరామకృష్ణ.

    నిర్మాత ‘ఠాగూర్‌’ మధు ఏమంటారంటే..

    నిర్మాత ‘ఠాగూర్‌’ మధు ఏమంటారంటే..

    అయితే ఈ సమస్య నుంచి చిత్రసీమ కుదురుకోవడానికి, కొంత సమయం పడుతుందని, రాబోయే సినిమాలపై దీని ప్రభావం ఉంటుందని మరో నిర్మాత ‘ఠాగూర్‌' మధు చెబుతున్నారు.

    వంద నోట్లు చాలా తక్కువ మంది దగ్గరే

    వంద నోట్లు చాలా తక్కువ మంది దగ్గరే

    ఠాగూర్ మధు మాట్లాడుతూ ...‘‘ఇప్పుడు ప్రజల దృష్టి మళ్లింది. నోట్ల గురించీ, అమెరికా అధ్యక్షుడి ఎన్నిక గురించీ చర్చించుకొంటున్నారు. ఈ దశలో వాళ్లంతా సినిమాల గురించి ఆలోచిస్తారని అనుకోవడం లేదు. రూ.వంద నోట్లు చాలా తక్కువ మంది దగ్గర అందుబాటులో ఉన్నాయి. వాళ్లంతా కొన్నాళ్లు పొదుపుగా వాడుకోవాలని చూస్తారు.

    లైట్ మేన్ లకుసైతం ...

    లైట్ మేన్ లకుసైతం ...

    చేతిలో వంద ఉంటే... టికెట్‌ కోసం ఖర్చుపెట్టేవాళ్లు ఎవరుంటారు? పెద్ద సినిమాలపై ఈ ప్రభావం తప్పకుండా ఉంటుంది. అయితే ఈమధ్య నిర్మాతల ఆలోచనా ధోరణి మారింది. నేనైతే లైట్‌ మెన్‌కి కూడా చెక్కుల రూపంలోనే పారితోషికాలు ఇస్తున్నా. వాళ్లూ అదే కోరుకొంటున్నారు. ప్రతీరోజూ సెట్లో లక్ష, రెండు లక్షల్లో లావాదేవీలు జరగడం మామూలే. ఇప్పుడు వాటి గురించే ఆలోచించాలి'' అంటున్నారు ఠాగూర్ మధు.

    రెమ్యునేషన్స్ తగ్గవు

    రెమ్యునేషన్స్ తగ్గవు

    బ్లాక్ మనీ ప్రభావం తగ్గితే... సినిమాపరిశ్రమలో రెమ్యునేషన్స్ పైనా బలమైన ప్రభావం పడే అవకాశాలున్నాయని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.నిర్మాత మధుర శ్రీధర్‌ మాత్రం ఆ అవకాశాలు లేవంటున్నారు.

    ఓ నటుడు అయితే

    ఓ నటుడు అయితే

    ‘‘ఇప్పటికి షాకింగ్‌గా అనిపించినా కొద్ది రోజులు పోతే అనూహ్యమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. పన్ను ఎగ్గొట్టడానికి వీల్లేదు... అని ప్రతీ ఒక్కరూ బలంగా ఫిక్స్‌ అయిపోతారు. ఈ పరిణామంతో పారితోషికాలు తగ్గుతాయి అనుకోవడం లేదు. అవి ఎప్పట్లా కొనసాగే అవకాశాలున్నాయి. నా సినిమాలో నటించిన ఓ నటుడు తన పారితోషికంలో దాదాపుగా 80 శాతం బ్లాక్‌లోనే ఇమ్మని డిమాండ్‌ చేశాడు. ఇప్పుడు ఆ అవకాశమే లేదు. ఇదీ ఒకందుకు మంచిదే. పేపర్‌పై అన్ని లెక్కలూ పక్కాగా ఉంటాయి. కొన్ని రోజుల్లో అంతా సర్దుకుంటుంది. అయితే ఈ రెండు రోజులు షూటింగులు చేసుకొనేవారి పరిస్థితి ఏంటన్నది ఆలోచించాలి. గురువారం నుంచి ‘ఫ్యాషన్‌ డిజైనర్‌' షూటింగ్‌ ఉంది. రోజువారి వేతనాలు ఎలా ఇవ్వాలో అర్థం కావడం లేదు''అన్నారు.

    English summary
    A tollywood hero is learnt to be in possession of nearly Rs 25 crore hard cash in his house, when Modi made the sudden announcement.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X