»   » మోహన్ లాల్ క్యారక్టర్ లీక్ : ఎన్టీఆర్ కు అంకుల్, స్టోర్ కీపర్ గా...

మోహన్ లాల్ క్యారక్టర్ లీక్ : ఎన్టీఆర్ కు అంకుల్, స్టోర్ కీపర్ గా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మోహన్ లాల్ తెలుగులో రెండు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మళయాళ సూపర్ స్టార్ అందుకోసం తెలుగు సైతం నేర్చుకున్నాడు. ఆయన తెలుగులో నటించటానికి అంతగా ప్రేరణ ఇచ్చిన ఆ రెండు చిత్రాల క్యారక్టర్స్ గురించి క్రింద ఇవ్వబోతున్నాం.

ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న కథనాలు మేరకు, ఈ మళయాళ సూపర్ స్టార్ ఏలేటి చంద్ర సేఖర్ చిత్రం కోసం స్టోర్ కీపర్ కానున్నాడు. చంద్రశేఖర్ యోలేటి డైరక్షన్ లో, మోహన్ లాల్ హీరోగా మెదలవబోతున్న సినిమా మనమంతా. ఈ సినిమాలో చాలా సింపుల్ కనిపిస్తారని, ఓ స్టోర్ కి కీపర్ గా ఓ చిత్రమైన పాత్రలో కనిపిస్తారని సమాచారం.

ఒకప్పటి హీరోయిన్ అయిన గౌతమి ఇందులో మోహన్ లాల్ సరసన నటిస్తోంది. దీనిని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. మల్టీలాంగ్వేజ్ లో రూపోందుతున్న ఈ సినిమా ప్రేక్షకులని మెప్పిస్తుందని ఫిల్మ్ వర్గాలు అనుకుంటున్నాయి.

ఎన్టీఆర్ చిత్రం విషయానికి వస్తే....

అంకుల్ గా

అంకుల్ గా

జనతా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్ కు అంకుల్ గా మోహన్ లాల్ కనిపించనున్నారు.

ముడివిప్పే

ముడివిప్పే

కథలో ఓ కీలకమైన మలుపు ఉండబోతుందని ఆ ముడిని విప్పే పాత్ర ఇదని, ఎన్టీఆర్ కోసం నిలబడే పాత్ర అని చెప్తున్నారు.

ఇంటర్వెల్ ముందు

ఇంటర్వెల్ ముందు

మోహన్ లాల్ పాత్ర జనతాగ్యారేజ్ లో ఇంటర్వెల్ కు ముందు వస్తుందని అక్కడ నుంచి ఇంటర్వెల్ ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్ ని లీడ్ చేస్తుందని చెప్పుకుంటున్నారు.

ఊహించని ...

ఊహించని ...

జనతాగ్యారేజ్ లో మోహన్ లాల్ పాత్ర లో కొంత సస్పెన్స్ ఉంటుందని, అది వేరే వారు వేస్తే ఇమేజ్ అడ్డం వస్తుందని, అలాగని తెలుగులో సీనియర్స్ వేస్తే ఆడియన్స్ గెస్ చేసేస్తారని అందుకే మోహన్ లాల్ ని ఎంపిక చేసారని అంటున్నారు.

మరి రెండు

మరి రెండు


రీసెంట్ గా మోహన్ లాల్ ని ఇంకో రెండు స్టార్ హీరోల చిత్రాలు కోసం తెలుగులో అడిగారని, ఆయన ఇప్పుడు చేస్తున్న చిత్రాలలో తన పాత్రలకు వచ్చే స్పందనను బట్టి ముందుకు వెళ్లాలని ఫిక్స్ అయ్యాడంటున్నారు.

నేర్చుకున్నాడు

నేర్చుకున్నాడు

తెలుగులో చేస్తున్న మోహన్ లాల్ డెడికేషన్ గా తెలుగు నేర్చుకోవటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

గతంలోనూ

గతంలోనూ

తెలుగులో మోహన్ లాల్ చేయటం కొత్తేమి కాదు..గతంలో ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన గాండీవం లో నటించారు. అందులో బాలకృష్ణ హీరో.

జిల్లాతో

జిల్లాతో

విజయ్ తో చేసిన జిల్లా చిత్రంలో చేసిన మోహన్ లాల్ ...ఆ సినిమా చూసిన తర్వాత మనవాళ్లకు ఆయన్ను తెలుగులో అడగవచ్చు అనిపించింది

English summary
Malayalam Superstar Mohanlal will be seen as a store keeper in Yeleti Chandrasekhar film and his look is too simple in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu