»   » డబ్బులిచ్చి మరీ అభిమాన సంఘాలు పెట్టించుకుంటోన్న స్టార్ హీరోయిన్

డబ్బులిచ్చి మరీ అభిమాన సంఘాలు పెట్టించుకుంటోన్న స్టార్ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
చెన్నై : తాము ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి, ఇప్పుడు తమ కూతుళ్లుని హీరోయిన్స్ గా చేసినప్పుడు..ఖచ్చితంగా తమ సలహాలు, సూచనలు ఇస్తూంటారు తల్లులు. అందులో తప్పేమి లేదు. తమ పిల్లలు ఒక స్దాయికి రావాలని కోరుకుంటూ అందుకోసం తమ పరిచయాలు, తమ అనుభవాలు వినియోగిస్తూ ముందుకు వెళ్లటం కలిసొచ్చే అంశమే. గతంలో చాలా మంది హీరోయిన్స్ తల్లులు తమ పిల్లలు నిలదొక్కుకోవటం కోసం కష్టపడ్డారు. ఇప్పుడూ అదే జరుగుతోంది.

హీరోయిన్ గా గతంలో ఒక వెలుగు వెలిగి తర్వాత పెళ్లి చేసుుకని సెటిలైన ఓ మాజీ హీరోయిన్ కుమార్తె ఓ రెండు సంవత్సరాల క్రితం లాంచ్ అయ్యింది. ఆమె అందంతో పాటు నటన కూడా ఉండటంతో అతి తక్కువ టైమ్ లోనే సూపర్ హిట్స్ ని సొంతం చేసుకుంది. తెలుగులోనూ రీసెంట్ గా ఓ పెద్ద హిట్ కొట్టింది.

Mother's effort make her daughter famous


హీరో పేరు మీద బిజినెస్ జరిగే ఈ కాలంలో ...తన కుమార్తె కోసం జనాలు సినిమాలకు వెల్లటం గమనించింది. సూపర్ హిట్టైన తన కుమార్తె సినిమాల్లో తన కుమార్తె పాత్ర ఎక్కువ ఉండటం,ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ రావటం, మీడియా అంతా తన కుమార్తె ఇంటర్వూ ల కోసం ప్రదిక్షణాలు చేస్తూండటం ఆమె గమనించింది. ఇదే సరైన సమయమనుకుంది.

దాంతో ఇప్పుడు తమ కుమార్తె కోసం ఆమె రంగంలోకి దిగింది. ఎట్టి పరిస్దితుల్లోనూ తన కుమార్తెకు వచ్చిన క్రేజ్ ని రెట్టింపు చేసి, నెంబర్ వన్ హీరోయిన్ ని చేయాలని కంకణం కట్టుకుందని సమాచారం. ఆ రోజుల్లో తాను నెంబర్ వన్ స్దాయికి వెళ్లపోయింది. ఇప్పుడు తన కుమార్తెని ఎలాగైనా నెంబర్ వన్ చేయాలనుకుందిట. దానికి కూతురు కూడా సై అంది.

ఇంకేముంది ముందు తన కుమార్తె కు అభిమాన సంఘాలు ఏర్పాటు చేయాలని పిక్స్ అయ్యింది. అందుకోసం డబ్బు లిచ్చి మరీ ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో తన కుమార్తె ఫొటోలు పెట్టడం, ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇవ్వటానికి సోషల్ మీడియా మేనేజర్ ని అపాయింట్ చేసిందిట.

అలాగే మీడియా వాళ్లకు కూడా తన కుమార్తె గురించి ఎంకరేజింగ్ గా రాయమని డబ్బులు ఆఫర్ చేస్తోంది. ఇలా అన్ని వైపుల నుంచి తన కుమార్తె కీర్తి పెరగటం కోసం కృషి చేస్తోంది. అవన్నీ ఫలించి ఆమె స్టార్ హీరోయిన్ గా, నెంబర్ వన్ గా అతి త్వరలోనే అవుతుందని భావిస్తోంది. ఆ రోజు కోసం ఎంత ఖర్చైనా పెడతానంటోంది. అదీ విషయం .

English summary
A former actress is reportedly encouraging fans to start fans club in her actress daughter's name all over Tamil Nadu
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu