»   » 'అత్తారింటికి దారేది' లో బొమన్ ఇరాని, ముఖేష్ రుషి పాత్రలేంటి?

'అత్తారింటికి దారేది' లో బొమన్ ఇరాని, ముఖేష్ రుషి పాత్రలేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'అత్తారింటికి దారేది'. త్రివిక్రమ్ దర్శకుడు. ఈ చిత్రం టీజర్,ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. దాంతో చిత్రంపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు బొమన్ ఇరాని,ముఖేష్ రుషి నటిస్తున్న సంగితి తెలిసిందే. వీరిద్దరి పాత్రలు చిత్రంలో కీలకమైనవే.

అందిన సమాచారం ప్రకారం ...బొమన్ ఇరాని పాత్ర ...పవన్ కి తాత అని తెలుస్తోంది. అలాగే ముఖేష్ రుషి పాత్ర ..పవన్ కి తండ్రి అని ..బొమన్ ఇరాని కుమారుడు గా కనిపించనున్నాడని సమాచారం. తాతతో కలిసి...స్పెయిన్ లో ఉండే పవన్ ...ఓ పని నిమిత్తం ఇండియాకు వచ్చినప్పుడు జరిగే సంఘటనల సమాహారమే చిత్రం ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. ఇక పవన్ కి అత్తగా నదియా కనిపిస్తే..ఆమె కూతురుగా సమంత కనిపించనుంది.


నిర్మాత మాట్లాడుతూ "బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఫస్ట్‌లుక్‌, టీజర్ ను విడుదల చేశాం. జూలై 19న పాటల్ని, ఆగస్ట్ 7న సినిమాను విడుదల చేస్తాం. దేవిశ్రీ ప్రసాద్ మంచి సంగీతాన్నిచ్చారు. ప్రేక్షకులు, అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది సినిమా'' అని అన్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను శనివారం, టీజర్ ని ఆదివారం ఆవిష్కరించారు.

ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్ నిర్మిస్తోంది. ఛత్రపతి ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ . సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఆర్ట్: రవీందర్, సహ నిర్మాతలు: భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, రచన, దర్శకత్వం: త్రివిక్రమ్.

English summary
It is heard that Mukesh Rishi will be seen as Pawan Kalyan’s father in ‘Attarintiki Daredi’. His father will be Boman Irani. Audio release function for the film will be held on July 19th and the movie will hit the screens on Aug 7th 2013.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu