తమిళ దర్శకుడికి బంపర్ ఆఫర్.. ఎవరూ ఊహించని రెమ్యునరేషన్ ఇస్తున్న టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్! .
తెలుగు సినిమా రేంజ్ పెరిగాక మన సినిమాలను దాదాపు అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో సత్తా ఉన్న సినిమాలు తీసే దర్శకుల కోసం నిర్మాతలు ఇతర భాషా ఇండస్ట్రీ లోకి వెళ్లి మరీ వెతుకుతున్నారు. తమిళ భాషలో సూపర్ హిట్ సినిమాలు అందించిన వారిని లైన్ చేసి తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.. అందులో భాగంగా ఇప్పటికే మురుగదాస్ తో సినిమాలు చేయడానికి తెలుగు లో ఉన్న కొన్ని ప్రొడక్షన్ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
తాజాగా మరో తమిళ డైరెక్టర్ తో సినిమా చేయడానికి టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ ప్రొడక్షన్ హౌస్ గా ఉన్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రయత్నిస్తోందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాక సదరు దర్శకుడికి ఏకంగా 5 కోట్ల రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేసిందని తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు లోకేష్ కనగరాజ్. ఇప్పుడు చేస్తున్న సినిమా కాకుండా ఆయనకు నాలుగు సినిమాలు చేసిన అనుభవం ఉంది. అందులో ఆయన చేసిన మొదటి రెండు సినిమాలు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. ఆయన కార్తీతో ఖైదీ సినిమా సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఆ తరువాత విజయ్ తో చేసిన మాస్టర్ సినిమా కూడా మన దగ్గర పెద్దగా ఆడకపోయినా తమిళంలో బాగానే ఆడింది.

ఈ దెబ్బతో ఆయన ఏకంగా విశ్వనటుడు కమల్ హాసన్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఆయన విక్రమ్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దగ్గర ఇద్దరు బడా టాలీవుడ్ హీరోల డేట్స్ ఉన్నాయట, ఆ ఇద్దరిలో ఎవరో ఒకరితో లోకేష్ కనగరాజ్ కధ ఒప్పించి బై లింగ్యువల్ సినిమా చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే కేవలం నాలుగు సినిమాలు అనుభవం ఉన్న లోకేష్ కనగరాజ్ కి అంతమేర రెమ్యునరేషన్ ఇవ్వడం అంటే రికార్డ్ అనే చెప్పాలి. అయితే ఇందులో నిజానిజాలు ఏమేరకి ఉన్నాయో తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











