»   » హాట్ టాపిక్ :రీషూట్ లో నాగార్జున చిత్రం

హాట్ టాపిక్ :రీషూట్ లో నాగార్జున చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తాము అనుకున్నట్లు రాకపోతే రీషూట్ లు పెట్టడం కామనే. అలాంటిదే ఇప్పుడు నాగార్జున చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా కు జరగబోతోందని సమాచారం. ఈ చిత్రంలో కొన్ని కీలకమైన సన్నివేశాలు... ఈ మధ్యనే వచ్చిన సూర్య హీరోగా వచ్చిన రాక్షసుడు చిత్రంలోని సీన్స్ ని పోలి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు రచయిత బుర్రా సాయి మాధవ్ ని నాగార్జున నియమించి కొత్త సీన్స్ రాయించినట్లు తెలుస్తోంది. ఆ సీన్స్ ని ఇప్పుడు షూటింగ్ పెట్టుకున్నారని, వచ్చే సంవత్సరమే ఈ చిత్రం రిలీజ్ అని చెప్తున్నారు.

మనం చిత్రంతో కథల ఎంపికలో తన పంథాను నాగార్జున మార్చుకున్న సంగతి తెలిసిందే. వైవిధ్యంతో కూడిన కథాంశాలకే ప్రాధాన్యతనివ్వాలని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా.. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా కల్యాణ్‌కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


Nag's Soggade Chinni Nayana : Going for re-shoot

రమ్యకృష్ణ, లావణ్యత్రిపాఠి హీరోయిన్స్. వినూత్న కథాంశంతో గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున తాతమనవడిగా ద్విపాత్రాభినయంలో నటించనున్నట్లు సమాచారం. రెండు పాత్రలు సరికొత్త పంథాలో సాగుతాయని చిత్రబృందం చెబుతోంది.


పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నాగార్జున రెండు పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో హాట్ హీరోయిన్ హంసా నందిని నటిస్తుంది. కొన్ని రోజులు షూటింగులో కూడా పాల్గొంది. తన పాత్ర వివరాలు వెల్లడించలేనని, నేను గతంలో నటించిన పాత్రల కంటే భిన్నమైన పాత్ర అని హంసా తెలిపింది. దర్శకుడు కథ చెప్పిన వెంటనే అంగీకరించిందట.


లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం స్వామిజీగా వినోదం పండిస్తారని సమాచారం. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా' నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాత. ‘హలో బ్రదర్' తరహాలో వినోదాత్మక సినిమా అని సమాచారం.


బ్రహ్మానందం, హంసానందిని, చలపతిరావు, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.

English summary
The makers of Soggade Chinni Nayana are planning to re-shoot some key scenes in the film. It is heard that the film will release next year due to the extended schedule
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu