»   » అల్లు అర్జున్ ‘నాపేరు సూర్య’లో నాగబాబుకు వాటాలు!

అల్లు అర్జున్ ‘నాపేరు సూర్య’లో నాగబాబుకు వాటాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: అల్లు అర్జున్ కథానాయకుడిగా వక్కతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' అనే సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.... 'తన కోసం ఓ సినిమా చేస్తానని అల్లు అర్జున్ ఇచ్చాడని, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, తమ బేనర్లో 'నా పేరు సూర్య' సినిమా చేస్తున్నారని, చాలా సంతోషంగా ఉంది' అని తెలిపారు.


  కాగా ఈచిత్రంలో నాగబాబుకు వాటాలు ఉన్నట్లు తెలుస్తోంది.


  నాగబాబుకు వాటాలు

  నాగబాబుకు వాటాలు

  ఈ చిత్రాన్ని నాగబాబు, బన్నీ వాసు ఆధ్వర్యంలో నిర్మిస్తున్నామని నిర్మాత లగడపాటి చెప్పడం బట్టి చూస్తే సినిమా నిర్మాణంలో వీరికి కూడా వాటాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు నిర్మాతగా ఓ వెలుగు వెలిగిన నాగబాబు ఆరెంజ్ సినిమా తర్వాత ఆర్థికంగా చితికిపోయి సినిమాలు తీయడం మానేసిన సంగతి తెలిసిందే.


  ఇప్పుడిప్పుడే నాగబాబు

  ఇప్పుడిప్పుడే నాగబాబు

  ఆర్థిక ఇబ్బందుల నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న నాగబాబు నేరుగా సినిమా చేసి రిస్క్ చేయకుండా.... ఇతర బేనర్లతో కలిసి సినిమాల నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నట్లు తెలుస్తోంది.


  నా పేరు సూర్య

  నా పేరు సూర్య

  ‘నా పేరు సూర్య' సినిమా విషయానికొస్తే ఈ చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్ ఎవరు? అనేది ఇంకా ఖరారు కాలేదు. యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఇతర నటీనటుల వివరాలు వెల్లడికానున్నాయి.


  నాగబాబు సమర్పణ

  నాగబాబు సమర్పణ

  ఈ చిత్రానికి ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి), ఫైట్స్ - రామ్ లక్ష్మణ్, సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి, ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, సినిమాటోగ్రఫి - రాజీవ్ రవి, సంగీతం - విశాల్ - శేఖర్,
  ప్రొడక్షన్ కంట్రోలర్ - డి. యోగానంద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబు, బ్యానర్ - రామలక్ష్మీ సినీ క్రియేషన్స్, సమర్పణ - k.నాగబాబు, సహ నిర్మాత - బన్నీ వాసు, నిర్మాత - శిరీషా శ్రీధర్ లగడపాటి
  రచన, దర్శకత్వం - వక్కంతం వంశీ.  English summary
  Producer Lagadapati Sridhar said that, Naga Babu share in 'Naa Peru Surya' production. "We are very much excited to associate with successful writer Vakkantham Vamsi who penned stories for Kick, Temper and Race Gurram is turning director now. Moreover, we are happy to have Nagababu and Bunny Vass on board. The film will have top actors and technicians across India. Vishal – Sekhar duo is providing wonderful music. We will announce other details soon.” Lagadapati Sridhar said.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more