నాగచైతన్య తాజా చిత్రం 'దడ' చిత్రం కాన్సెప్టు ఏమిటి?
నాగచైతన్య, కాజల్ కాంబినేషన్ లో అజయ్ భుయాన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'దడ'. ఈ చిత్రంలో నాగచైతన్య ఓ విలక్షణమైన పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. విచిత్రమైన పరిణామాల మద్య ప్రమాదంలో చిక్కుకున్న కాజల్ ను రక్షించే ప్రేమికుడి పాత్రలో నాగ చైతన్య కనిపించనున్నాడు. కాజల్ ను ఎప్పటికప్పుడు సేవ్ చేస్తూ విలన్స్ కు 'దడ' పుట్టించే యాక్షన్ హీరోగా నాగచైతన్య ఈ సినిమాలో కనిపించనున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం యూరోప్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో తమిళ నటుడు శ్రీరామ్ నాగచైతన్య అన్నగా కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని కామాక్షి కళామూవీస్ బ్యానర్ ఫై నిర్మాత శివప్రసాద్ రెడ్డి కుమారుడు చందన్ రెడ్డి నిర్మిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అబ్బూరి రవి మాటలు అందిస్తున్న ఈ చిత్రం జూలై ఆఖరి వారంలో కాని, ఆగస్ట్ మొదటి వారంలో కాని రిలీజయ్యే అవకాశముందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











